Ads
అయోధ్యలో రామమందిరం భూమిపూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల తో ఆ ప్రదేశం అంతా పండగ వాతావరణం నెలకొంది. ఈ రోజు నుండి అయోధ్యలో పూజలు ప్రారంభం అవుతున్నాయి. స్థానికులు గంట మోగిస్తూ, లేదా ప్లేట్ల పై కొడుతూ శ్రీరాముడిని స్వాగతిస్తారు.
Video Advertisement
ముహూర్త సమయమైన ఉదయం 11 గంటల 40 నిమిషాలు అవ్వడానికి ఒక పది నిమిషాల ముందు ప్రజలను బయటికి రావాలి అని కోరారు. పూజ తర్వాత అయోధ్యలో ప్రసాదం పంచుతారు. ఆగస్టు 4వ తేదీ రాత్రి స్థానికులు వాళ్ల ఇళ్లల్లో ఇంకా గుడిలో దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకుంటారు అని సమాచారం.
ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరవుతారు. అయోధ్యలో మోదీ మూడు గంటలు ఉంటారు. రామ మందిరం భూమి పూజకు 175 మంది అతిథులను ఆహ్వానించారు. వారిలో 135 మంది వివిధ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన వారు.
ఇది ఇలా ఉండగా…అయోధ్యలో అద్భుత సన్నివేశం చోటుచేసుకుంది. సీతారాముల కాళ్ళు మొక్కిన వానరం. ఆ వీడియో మీరే చూడండి.
watch video:
End of Article