ఒక్క నెలలో అయోధ్య రామునికి ఎన్ని కోట్ల విరాళాలు వచ్చాయో తెలుసా? ఎన్ని లక్షల మంది దర్శించుకున్నారు అంటే.?

ఒక్క నెలలో అయోధ్య రామునికి ఎన్ని కోట్ల విరాళాలు వచ్చాయో తెలుసా? ఎన్ని లక్షల మంది దర్శించుకున్నారు అంటే.?

by Harika

Ads

ఈ ఏడాది జనవరి 22న అంగరంగ వైభవంగా అయోధ్య రామాలయం లో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఆ రోజు నుంచి బాలరాముడిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. జనవరి 23 నుంచి దాదాపు 60 లక్షల మంది భక్తులు రాముడిని దర్శించుకున్నారని రామాలయ ట్రస్ట్ కార్యాలయం ఇన్చార్జి ప్రకాష్ గుప్తా తెలిపారు.

Video Advertisement

ఈ నెల రోజుల వ్యవధిలో అయోధ్య రామాలయానికి 25 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. 25 కిలోల బంగారు, వెండి ఆభరణాల తో పాటు చెక్కులు, డ్రాఫ్ట్ రూపంలో భక్తులు సమర్పించినట్లు రామజన్మభూమి తీర్థ ట్రస్టు వెల్లడించింది. శ్రీరామనవమి రోజున 50 లక్షల మందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు.

అయితే ట్రస్ట్ బ్యాంకు ఖాతాలలోకి నేరుగా ఆన్లైన్ లావాదేవీల ద్వారా వచ్చిన ఆదాయం గురించి తమకు తెలియదని వివరించారు. ఆలయంలో వినియోగించని వెండి, బంగారంతో చేసిన పాత్రలు సామాగ్రిని రామలల్లాకు విరాళంగా ఇస్తున్నారని, భక్తుల భక్తిని దృష్టిలో ఉంచుకొని స్వీకరిస్తున్నామని వెల్లడించారు. వెల్లువలా వచ్చి పడుతున్న భక్తుల కానుకలు, విరాళాలను సునాయాసంగా లెక్కించటానికి వీలుగా ఆలయంలో ఎస్ బి ఐ నాలుగు ఆటోమేటిక్ హైటెక్నాలజీ కౌంటింగ్ మిషన్లు ఏర్పాటు చేసిందని రామాలయ ట్రస్ట్ అధికారి ప్రకాష్ గుప్తా వెల్లడించారు.

విరాళాలకు సంబంధించిన రసీదులను జారీ చేయడానికి 12 కంప్యూటరైజ్డ్ కౌంటర్లు సిద్ధం చేశామని, ట్రస్ట్ ద్వారా ఆలయ ప్రాంగణంలో అదనపు విరాళాలు, పెట్టెలను కూడా ఏర్పాటు చేశామని ప్రకాష్ గుప్తా వివరించారు. విరాళాలు లెక్కింపు కోసం త్వరలోనే అన్ని సౌకర్యాలతో కూడిన పెద్ద గదిని కూడా నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. బాల రామునికి బహుమతులుగా వచ్చిన ఆ బంగారము, వెండి ఇతర విలువైన వస్తువులను కరిగించి నిర్వహణ కోసం భారత ప్రభుత్వానికి అప్పగించనున్నారు.

విరాళాలకు సంబంధించి ఎస్ బి ఐ తో ట్రస్ట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని కూడా వివరించారు. ఈ ఒప్పందం ప్రకారం విరాళాలు, చెక్కులు, డీడీలు నగదు వేరే వాళ్లకు సంబంధించి ఎస్ బి ఐ జవాబుదారీగా వ్యవహరిస్తుంది. నగదు విరాళాల లెక్కింపు రోజుకి రెండుసార్లు రెండు షిఫ్టులలో జరుగుతుందని ఇందుకు అనుగుణంగా ఎస్ బి ఐ సిబ్బందిని పెంచిందని వివరించారు.


End of Article

You may also like