నిర్మించిన 5 నెలలకే అయోధ్య రామ మందిరంలో నీటి లీకేజ్ రావడం ఏంటి..? అర్చకులు ఏం చెప్పారంటే..?

నిర్మించిన 5 నెలలకే అయోధ్య రామ మందిరంలో నీటి లీకేజ్ రావడం ఏంటి..? అర్చకులు ఏం చెప్పారంటే..?

by Mohana Priya

Ads

దాదాపు 5 నెలల క్రితం అయోధ్యలోని రామ మందిరం ఎంతో ఘనంగా వేడుకలు జరుపుకుంది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఎంతో మంది ప్రముఖులు ఈ వేడుకకి హాజరు అయ్యారు. అప్పుడు ప్రపంచం అంతా కూడా ఈ వేడుక గురించి మాట్లాడుకున్నారు. సినిమా రంగానికి చెందినవారు, రాజకీయ రంగానికి చెందినవారు, క్రీడా రంగానికి చెందినవారు, వ్యాపార రంగానికి చెందిన వారు ఇలా ఎంతో మంది ఈ వేడుకకి హాజరు అయ్యారు. అప్పుడు గుడి గురించి మాట్లాడుతూ 1000 సంవత్సరాలైనా చెక్కుచెదరకుండా ఉండేలాగా ఈ గుడి నిర్మించాం అని తెలిపారు. కానీ ఇప్పుడు గుడిలోకి నీళ్లు రావడం మొదలు అయ్యాయి. వర్షపు నీరు గుడిలోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం చర్చలకి దారి తీసింది.

Video Advertisement

ayodhya ram mandir rain water

ఈ విషయం మీద అయోధ్యలోని రామ మందిరం ప్రధాన అర్చకులు అయిన సత్యేంద్ర దాస్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, “మొదటి వర్షానికి నీరు ఆలయం పైకప్పు నుండి లీకేజ్ వచ్చింది. లోపల అంతా నీళ్లు నిండిపోయాయి. వర్షపు నీళ్ళు బయటికి వెళ్లడానికి దారి కూడా లేదు” అని చెప్పారు. సమస్యలు గుర్తించి వాటికి పరిష్కారం కూడా చేయాలి అని చెప్పారు. ఇదే విషయం మీద శ్రీరామ మందిరం కన్స్ట్రక్షన్ కమిటీ చైర్మన్ అయిన నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ, “నేను అయోధ్యలోనే ఉన్నాను. మొదటి అంతస్తు నుండి వర్షపు నీరు కారణం నేను చూశాను. రెండవ అంతస్తులో ఉన్న గురు మండపం ఆకాశం వైపుగా ఉంటుంది. ఈ ఓపెనింగ్ ని శిఖర్ కవర్ చేస్తుంది. కాబట్టి ఇలా జరుగుతుంది అని అనుకున్నాను.”

“నేను కండ్యూట్ నుండి కొంత సీపేజ్ చూశాను. మొదటి ఫ్లోర్ లో పని నడుస్తోంది. అది పూర్తి అవ్వగానే కండ్యూట్ భాగాన్ని మూసేస్తాం. శాంటోరమ్‌లో గర్భగుడిలో డ్రైనేజ్ లేదు. ఎందుకంటే అన్ని మండపాలు నీళ్లు క్లియర్ అవ్వడం కోసం ఒక స్లోప్ లాగా నిర్మించబడ్డాయి. శాంటోరమ్‌లో గర్భగుడిలో నీళ్లు మామూలుగానే అబ్సార్బ్ చేసుకుంటాయి. భక్తులు దేవుడికి అభిషేకం చేయడం లేదు. డిజైన్ వల్ల కానీ కన్స్ట్రక్షన్ వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. మండపాలు తెరిచి ఉంటే అందులోకి వర్షపు నీటి చుక్కలు వస్తాయి అనే చర్చ జరిగింది. కానీ నగర్ నిర్మాణం నిబంధనల ప్రకారం మండపాలని తెరిచి ఉంచాలి అని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు.


End of Article

You may also like