అయోధ్య రామమందిర నిర్మాణ విశిష్టత ఇదే…161 అడుగుల ఎత్తు, 5 గుమ్మటాలు, అష్టభుజి ఆకృతిలో గర్భగుడి.!

అయోధ్య రామమందిర నిర్మాణ విశిష్టత ఇదే…161 అడుగుల ఎత్తు, 5 గుమ్మటాలు, అష్టభుజి ఆకృతిలో గర్భగుడి.!

by Mohana Priya

Ads

ఎన్నో సంవత్సరాల నుండి హిందువులు కన్న కల ఇప్పుడు నిజం అవ్వబోతోంది. ఎన్నో సంవత్సరాలు రామమందిరం కోసం పడిన కృషి ఇవాళ ఫలించబోతోంది. అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ఇవాళ భూమిపూజ జరగనుంది.

Video Advertisement

భూమి పూజ కోసం అయోధ్య నగరమంతా అందంగా అలంకరించబడింది. ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేయనున్నారు. రామ మందిర నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్విట్టర్ లో విడుదల చేసింది.

 

రామమందిరాన్ని రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఉత్తర భారతదేశ నాగర శైలి లో రామమందిర నిర్మాణం జరగనుంది. ఒకేసారి లక్ష మంది భక్తులు సమావేశం అయ్యేలా ఆలయ సముదాయం ఉండబోతోంది.

ముందు అనుకున్న నమూనా కంటే ఆలయం ఎత్తు 20 అడుగుల పెంచారు అని శిల్పులు చెప్పారు. రామమందిర నిర్మాణం భూమి పూజ కోసం భారతదేశంలోని 2000 ప్రాంతాల నుండి మట్టి ని తీసుకొచ్చారు. నూటొక్క నదుల నుండి నీటిని తీసుకొచ్చారు.

రామమందిరాన్ని 3 అంతస్తులుగా 161 అడుగుల ఎత్తులో నిర్మిస్తారట. గతంలో ప్రణాళిక వేసిన దానికంటే రెట్టింపు ఎత్తులో రామమందిర నిర్మాణం జరగనుందట. శ్రీ రామ్ జన్మభూమి మందిరం భారతీయ సంస్కృతిక నిర్మాణానికి ఉదాహరణగా నిలుస్తుంది అని, ఆధ్యాత్మిక వైభవానికి అద్దం పట్టేలా రామ మందిరం నిర్మించబడుతుంది అని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ప్రముఖ శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత చంద్రకాంత్ సోమ్‌పుర రామమందిర నమూనా నిర్మాణాన్ని డిజైన్ చేశారు సోమ్‌నాథ్‌, అక్షర్‌థామ్‌ వంటి ఎన్నో పుణ్యక్షేత్రాల ఆకృతులు చంద్రకాంత్ కుటుంబం రూపొందించారు. ప్రస్తుతం చంద్ర కాంత్ భారత దేశంలో నిర్మించబోతున్న 8 ఆలయాలకు డిజైన్లను రూపొందిస్తున్నారు. రామమందిర నిర్మాణ నమూనాల కోసం 30 ఏళ్ల కిందటే తనను సంప్రదించినట్లు చంద్రకాంత్ తెలిపారు.

నమూనా ప్రకారం ఆలయంలో మొత్తం ఐదు గుమ్మటాలు ఉంటాయి. గర్భగుడి ఆక్టాగాన్ (అష్టభుజి) ఆకృతిలో ఉంటుంది. రామమందిర నిర్మాణం లో ఇనుము, సిమెంట్ వాడరు. రాజస్థాన్, ఆగ్రా నుండి తెప్పించిన రాతి పలకలతో ఆలయ నిర్మాణం జరుగుతుంది.

ఆలయ ప్రధాన ద్వారం దగ్గర ఎంత దూరం లో నిల్చున్నా కూడా శ్రీరాముని విగ్రహం కనిపించేలా నిర్మిస్తారు. రిక్టర్ స్కేల్ పై 10 తీవ్రత ఉండే భూకంపం వచ్చినా కూడా ఆలయం చెక్కుచెదరకుండా ఉండేలా, వెయ్యేళ్ళు అయినా కూడా ఆలయ పటిష్టత, నిర్మాణం దెబ్బతినకుండా బలంగా ఉండేలా ఆలయాన్ని నిర్మించనున్నారు.


End of Article

You may also like