అయోధ్యలో మందిరం నిర్మిస్తుంటే…తవ్వకాల్లో వెలుగులోకొచ్చిన పురాతన విగ్రహాలు ఇవే..!

అయోధ్యలో మందిరం నిర్మిస్తుంటే…తవ్వకాల్లో వెలుగులోకొచ్చిన పురాతన విగ్రహాలు ఇవే..!

by Megha Varna

Ads

పురాతన తత్వవేత్తలు రకరకాల ప్రదేశాలలో తవ్వకాలు జరిపి పురాతన అవశేషాలను వెలికి తీస్తూ ఉంటారు.ఆలా వెలికి తీసిన వస్తువులను మ్యూజియం లో ఉంచుతారు.అయితే ఇలాంటి తవ్వకాల వలన మన పూర్వం ఎలాంటి పరిస్థితులు ఉండేవో అనే విషయం తెలుస్తుంది.వెలికి తీసిన వస్తువులు ఎన్ని సంవత్సరాల పూర్వనివి అని కూడా కొన్ని పరీక్షలు చేసి నిర్దారిస్తారు.అయితే తాజాగా రాముని జన్మభూమి అయినా అయోధ్యలో కొన్ని పరిస్థితుల నిమిత్తం ఇటీవల తవ్వకాలు జరిపారు.

Video Advertisement

sakshi sourceఈ క్రమంలో కొన్ని పాడైపోయిన పోయిన విగ్రహాలతో పాటు ,ఐదు అడుగుల ఎత్తైన శివలింగం,ఏడు నల్లరాతి స్తంబాలు,కలశంతో సహా కొన్ని పురాతన వస్తువులు లభ్యమయ్యాయి.ఈ విషయంపై శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ జెనరల్ సెక్రటరీ చంపత్ రాజ్ స్పందిస్తూ…..”రామ జన్మభూమిలో గత పది రోజులుగా భూమిని చదును చేస్తున్నారు .ఈ క్రమంలో అక్కడ శిధిలాలను తొలగిస్తున్నారు .ఈ తవ్వకాల్లో భాగంగా పిల్లర్లతోపాటు శిల్పాలు కూడా లభించాయి అని తెలిపారు “.

ఈ సంఘటన పై విశ్వహిందూ అధినేత వినోద్ బన్సల్ స్పందిస్తూ…మే 11 న రామాలయానికి సంబందించిన పనులు ప్రారంభించారు.కాగా ఈ తవ్వకాలలో పూర్ణ కుంభం వంటి ఎన్నో పురాతన వస్తువులు లభించాయి అని తెలిపారు .అయితే ఎన్నో యేళ్ళ నుండి అయోధ్య సమస్యపై హిందువులు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలోనే సుప్రీమ్ కోర్ట్ ఈ వివాదాన్ని పరిష్కరించింది.

రామజన్మ భూమి హిందువులదే అని సదరు బాధ్యతలను కొంతమంది హిందూ ప్రముఖులకు అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది.కాగా ఎప్పటినుండో దేశవ్యాప్తంగా హిందువులు అయోధ్య నిర్మాణం చెయ్యాలని తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో ఎప్పుడూ వెల్లడిస్తునే ఉన్నారు.అయితే ఈ మధ్యకాలంలో అది నిజం అవుతుండడంతో హిందువులు హర్షం వ్యకం చేస్తున్నారు.

 

 


End of Article

You may also like