Ads
అయోధ్య రామ మందిరంలో జనవరి 22 న శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ట శుభ సమయం కోసం యావత్ దేశం ఎంతగానో ఎదురు చూస్తోంది. ఈ కార్యక్రమానికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులతో పాటు దేశంలోని ప్రముఖులు, సాధువులు, లక్షలాది భక్తులు తరలి రానున్నారు. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులకు ఈ వేడుకకు ఆహ్వానం వెళ్ళింది. సామాన్యులకు ఈ వేడుకకు అనుమతి లేదు. దీన్నే ఇప్పుడు హ్యకర్లు అదునుగా తీసుకుని రెచ్చిపోతున్నారు.
Video Advertisement
రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి విఐపి యాక్సెస్ లభిస్తుంది అంటూ ఫోన్లకు ఒక ఏపీకే ఫైల్ లింకును ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. దీంతో హ్యాకర్లకు మీ ఫోన్ లో యాక్సెస్ దొరికేస్తుంది.మీ ఫోటోలో మీ కాంటాక్ట్ లిస్ట్ మీ పర్సనల్ డేటా అంత వారి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈ విషయం తెలియని చాలామంది ఆ వార్త నిజమేనేమో అంటూ ఆ లింక్ ని చాలా మందికి ఫార్వర్డ్ చేస్తున్నారు. కాబట్టి ఈ మెసేజ్ ల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
https://www.instagram.com/reel/C16rOM8yxHo/
End of Article