ఈ కషాయంతో 5 రోజుల్లోనే కరోనా ఖతం అంట..! కానీ కరోనా ముందుగా గుర్తింపు రావాలంటే?

ఈ కషాయంతో 5 రోజుల్లోనే కరోనా ఖతం అంట..! కానీ కరోనా ముందుగా గుర్తింపు రావాలంటే?

by Mohana Priya

Ads

కరోనా పూర్తిగా తగ్గడానికి చాలా సమయం పడుతుంది. కానీ అప్పటివరకూ అందరం ఇలానే పనులు ఆపుకొని కూర్చుంటే కష్టం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పలు శాస్త్రవేత్తలు కరోనా కి మందు కనుక్కునే పనిలో ఉన్నారు. ఇప్పటికే ప్రపంచానికి ఎంతో నష్టం అయ్యేలా చేసిన కరోనా ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతోందో ఊహకు కూడా అందడం లేదు. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కరోనా కి వ్యాక్సిన్ కనుక్కోవడానికి పగలు రాత్రి తేడా లేకుండా శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు.

Video Advertisement

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 120 పరిశోధనలు జరిగితే వాటిలో డిసెంబర్ నాటికి ఖచ్చితంగా 7 వ్యాక్సిన్లు తయారవుతాయి. తమిళనాడులోని తాంబరం లో ఉన్న సిద్ధ ఇన్స్టిట్యూట్ కి చెందిన డాక్టర్లు తాము ఇప్పటికే కరోనా కి మందు కనిపెట్టేశాం అని చెబుతున్నారు. కబసుర కుడినీర్ అనే ఆయుర్వేద మూలికల తో తయారు చేసిన కషాయం కరోనా కి మందు గా వాడొచ్చు అని చెబుతున్నారు.

ఈ కషాయాన్ని వైరల్ ఫీవర్ లకు మందుగా వాడతారు దీన్ని ఐదు రోజులు వరుసగా తాగితే కరోనా పాజిటివ్ వచ్చిన రోగులకు తర్వాత టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ అని తేలింది. దాంతో కరోనా కి ఇది ఖచ్చితంగా విరుగుడు మందు అని సిద్ధ ఇన్స్టిట్యూట్ డాక్టర్లు ఎంతో నమ్మకంతో చెబుతున్నారు. ఈ కషాయం ఇప్పటికే రెండు దశల పరీక్షలు పూర్తి చేసుకుంది. మూడో దశ పరీక్ష కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఐసీఎంఆర్ అనుమతితో ఈ కషాయాన్ని భారత దేశ వ్యాప్తంగా పరిచయం చేయొచ్చు అని డాక్టర్లు అంటున్నారు.

ఈ పరిశోధన డిసెంబర్లోనే మొదలైందట. చైనాలో కరోనా వచ్చింది అని తేలినప్పుడే సిద్ధ డాక్టర్లు వైరస్ లక్షణాలు ఏంటో తెలుసుకుని భారతీయ మూలికలను ఎంచుకొని వాటితో నయం చేయొచ్చా అన్న దానిపై పరిశోధనలు మొదలుపెట్టారు. ముందు ఆ మూలికలతో చూర్ణం తయారు చేశారు.

ఆయుర్వేదం కాబట్టి ఎలాగో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దాంతో ఏప్రిల్ 1 రోజు పాజిటివ్ వచ్చిన కరోనా పేషెంట్లను రెండు గ్రూపులుగా విడదీసి ఐదు రోజుల పాటు ఈ చూర్ణాన్ని ఇచ్చారు. ఆరవ రోజు ఆ పేషెంట్లకు నెగిటివ్ వచ్చింది. తర్వాత కూడా వారిలో కరోనా లక్షణాలు కనిపించలేదు. దాంతో ఈ మందును ఐదు రోజులు వరుసగా తీసుకుంటే కరోనా బెడద తప్పుతుంది అని డాక్టర్లు నిర్ధారించారు.

ఈ చూర్ణాన్ని నీళ్లలో కలిపి ఉడికిస్తే కషాయం తయారవుతుంది. తిరుపత్తూర్ జిల్లాలోని అగ్రహారం లో ఉన్న క్వారంటైన్ కేంద్రంలో 42 మంది కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులకు ఈ కషాయాన్ని ఇచ్చారు. పేషెంట్లకు ఆహారం కూడా క్వారంటైన్ కేంద్రంలో డాక్టర్ల పర్యవేక్షణలో తయారుచేసింది మాత్రమే ఇచ్చారు. ఈ కషాయాన్నిభోజనం అయిన తర్వాత పేషెంట్లందరికీ ఇచ్చేవాళ్ళు. పెద్దలకు 60 ఎంఎల్, పిల్లలకు 15 ఎంఎల్ ఇచ్చారు. ఇలా 14 రోజులు వరుసగా ఆ కషాయాన్ని పేషంట్ల చేత తాగించారు. 70 ఏళ్ళు ఉన్న పేషెంట్లకు చూర్ణాన్ని ఇచ్చారు.

ఒక 5 ఏళ్ల బాలుడికి ఈ కషాయం తీసుకున్న తర్వాత పొడి దగ్గు వచ్చింది దాంతో అతన్ని ఇంటికి పంపించేశారు. కషాయం తీసుకున్న వెంటనే పదిమంది పేషెంట్లకు అలసట తగ్గింది. ముందు ఈ కషాయాన్ని నేరుగా సోకిన పేషెంట్లకి ఇచ్చారు. తర్వాత కాంటాక్ట్ ద్వారా సోకిన పేషెంట్లకు ఇచ్చారు.

రెండు గ్రూపుల పేషెంట్లకి కషాయం తాగిన ఐదు రోజుల్లోనే ప్రభావం చూపి రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది. తర్వాత 42 మందికి ఒకేసారి కరోనా టెస్ట్ చేశారు మళ్లీ నెగిటివే వచ్చింది. తర్వాత వాళ్లందరినీ 14 రోజులు క్వారంటైన్ పీరియడ్ లో ఉంచారు. తర్వాత వారిలో వ్యాధి లక్షణాలు ఏమీ కనిపించలేదు.

మూడోసారీ టెస్ట్ లో సక్సెస్ అయితే కరోనా మందుగా గుర్తింపు:

ఒక నెల తర్వాత కబాసుర కుడినీర్ కి మూడో దశ పరీక్ష ఉంటుంది. ఒకవేళ ఇది అప్రూవ్ అవుతే దీన్ని ప్రజల్లోకి తీసుకు రావడానికి వ్యాక్సిన్ తయారు చేసే సమయం కంటే తక్కువ సమయం పడుతుందట. ఎటువంటి రోగాన్ని అయినా నయం చేసే శక్తి ఆయుర్వేదానికి ఉంది అంటారు. ఒకవేళ ఈ ఔషధం మూడో టెస్ట్లో కూడా పాస్ అవుతే కషాయానికి అధికారికంగా గుర్తింపు లభించడంతో పాటు ఆయుర్వేదానికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ దక్కుతుంది.


End of Article

You may also like