Ads
ఇటీవల యాదాద్రిలో జరిగిన ఒక సంఘటన చర్చలకి దారి తీసింది. వివరాల్లోకి వెళితే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీతతో కలిసి, మార్చి 11వ తేదీ రోజు ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే రేవంత్ రెడ్డి తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ కూడా వెళ్లారు.
Video Advertisement
పూజలు జరిగిన తర్వాత వేద పండితులు ఆశీర్వాదాలు అందించడానికి, ఆలయం లోపల, ముఖ్యమంత్రితో పాటు మిగిలిన మంత్రులు అందరూ కూర్చునేందుకు 4 పీటలు వేశారు. ఆ పీటలు చాలా ఎత్తుగా ఉన్నాయి. ఆ పీటల మీద రేవంత్ రెడ్డి దంపతులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూర్చున్నారు.
కోమటి రెడ్డి పక్కన ఒక పీట మీద భట్టి విక్రమార్క కూర్చున్నారు. కానీ ఆ పీట ఎత్తు తక్కువగా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చున్న మరొక వైపు పీట మీద కొండా సురేఖ కూర్చున్నారు. ఆ పీట ఎత్తు కూడా తక్కువగా ఉంది. సాధారణంగా అయితే, ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క సీట్లో, ఉపముఖ్యమంత్రి పార్టీ విక్రమార్క కాబట్టి ఆయన కూర్చోవాలి. కానీ అలా జరగకపోవడం వలన ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దళితుడు కాబట్టి భట్టి విక్రమార్క, అంతే కాకుండా బహుజన బిడ్డ కొండా సురేఖని అవమానించారు అంటూ బీఆర్ఎస్ పార్టీ కామెంట్ చేసింది.
అయితే, ఈ విషయం మీద ఇప్పుడు బాబు గోగినేని స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాబు గోగినేని ఇలా రాశారు. “పెద్ద పీట చిన్న పీట. వీళ్ళు అందరూ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమిటి అని అడగకుండా పెద్ద-పీట చిన్న-పీట చర్చలో నిమగ్నమై ఫుల్ టైమ్ పాస్ చేసుకుంటున్న పిల్లలూ! కుడివైపు చూడండి. పూజారి లాగా అనిపిస్తున్న సార్ నేలమీద కూర్చున్నారులా ఉంది. ఆయనది ఏ కులమో! నిజంగా వివక్ష ఉన్నచోట ఆందోళన చేసి, రెండు గ్లాసులు ఉన్నచోట దాన్ని బయట పెట్టి, గుడిలోకి దళితులను రానివ్వని చోట ఆందోళన చేయమంటాను. వివక్ష పాటిస్తున్న వారిని పోలీసులకు పట్టివ్వమంటాను నేను.”
“ఇలా అనవసర, అసందర్భ, పనికిరాని లొల్లి చేయడం ఆపి, మనోభావాలు దెబ్బ తీసుకొవడానికి కాచుకుని కూర్చొని సమస్య లేని చోట గోల చేసి అభాసుపాలు అవ్వవద్దు అంటాను. భట్టి విక్రమార్క గారి వ్యక్తిత్వం పట్ల, ఆయన దర్పం పట్ల కూడా గౌరవం ఉండాలి. ఆయన తనను వివక్ష కు గురి చేస్తే లొంగిపోతారు అనుకోవడం అనేది ఆయనకు ఈ గోల పెట్టేవారు ఇచ్చే మర్యాద. జీవితంలో నిజమైన ఆందోళన ఎప్పుడూ చేయని ఇంటర్నెట్ ఏడుపు మొఖాలు ఎక్కువైపోతున్నాయి. యాంటి సోషల్ మీడియా లో ఏడవడమే ఉద్యమం అనుకుంటున్నాయి.”
“సరే గానీ, ఈ మూడో బొమ్మలో ఏమైతున్నదో చూడుర్రి. అక్కడ కుర్చీ లో కూర్చున్నది ఎవరు? కుర్చీ లేనిది ఎవరికి?” అని రాశారు. అయితే ఈ విషయం మీద భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “కావాలనే చిన్న పీట మీద కూర్చున్నాను” అని, “ఉపముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శాసిస్తున్నాను. మూడు శాఖలలో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నాను” అని అన్నారు. తాను ఆత్మగౌరవంతో జీవించే మనిషిని అని, తనని ఎవరు అవమానించలేదు అని పేర్కొన్నారు.
ALSO READ : అందరి చూపు ఆమెవైపే…ఎవరు ఆమె.? 1984 నుంచి ఒవైసీల అడ్డా…ఈసారి బీజేపీ జెండా ఎగరనుందా.?
End of Article