వయసు చిన్నదైనా మనసు పెద్దది…కార్తీక దీపం శౌర్య చేసిన ఈ పనికి ఫిదా అవ్వకుండా ఉండలేము!

వయసు చిన్నదైనా మనసు పెద్దది…కార్తీక దీపం శౌర్య చేసిన ఈ పనికి ఫిదా అవ్వకుండా ఉండలేము!

by Mohana Priya

Ads

తెలుగు సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సీరియల్ లో నటించే నటీనటుల అందరూ దాదాపు ప్రతి తెలుగువారి కుటుంబంలో ఒక భాగమైపోయారు. హీరో, హీరోయిన్, సహాయ నటీనటులే కాకుండా చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఈ సీరియల్ లో చాలా బాగా నటిస్తారు. అందుకే ఈ సీరియల్ లో నటించే చిన్న పిల్లలకి కూడా దాదాపు హీరోహీరోయిన్ల కి ఉన్నంత పాపులారిటీ ఉంది.

Video Advertisement

ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ల లో శౌర్య పాత్ర పోషిస్తున్న బేబీ క్రితిక ఒకరు. క్రితిక సీరియల్ లోనే బయట కూడా అంతే హుషారుగా ఉంటుంది. ఇంత చిన్న వయసులోనే పద్యాలు, ఎన్టీఆర్ డైలాగులు చెబుతూ లాక్ డౌన్ లో కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులను అలరిస్తోంది. క్రితిక ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలో కూడా కనిపించింది అనే విషయం అందరికి తెలిసిందే. ఇంత ప్రతిభావంతురాలైన క్రితిక ఇతరులకి స్వచ్ఛందంగా సేవ చేయడం లో కూడా ఎప్పుడూ ముందు ఉంటుంది.

తన పుట్టిన రోజుకి లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజు ఉన్నప్పుడు ఆశ్రమానికి వెళ్లి తనకి తోచినంత సహాయం చేస్తుంది. తను చేయడమే కాకుండా తన అభిమానులకు కూడా ఇతరులకు సహాయం చేయమని చెబుతుంది. దానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఇటీవల ఒక అభిమాని తన భార్య పుట్టినరోజు నాడు క్రితిక ని తన భార్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పమని అడిగాడు.

దానికి క్రితిక “సరే చెప్తాను కానీ నేను చెప్పిన ఒక పని చెయ్యాలి” అని చెప్పింది. అందుకు ఆ అభిమాని సరే అన్నాడు. అప్పుడు క్రితిక ” కనీస అవసరాల సదుపాయం లేని వారికి ఎవరికైనా వెయ్యి రూపాయలతో మీకు తోచిన సహాయం చేయండి. ఆ ఫోటోలు నాకు పంపించండి” అని చెప్పింది.

కృతిక చెప్పినట్టుగానే ఆ అభిమాని కొంత మందికి పప్పు, బియ్యం, నూనె లాంటి ఇంటికి అవసరమయ్యే సరుకులను ఇచ్చి ఆ ఫోటోలను క్రితిక కి పంపించాడు. అప్పుడు క్రితిక అతని భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి సహాయం చేసినందుకు అతనికి కూడా ధన్యవాదాలు చెప్పింది.

వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ అంతా స్క్రీన్ షాట్ తీసి క్రితిక తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. క్యాప్షన్ లో ఆ అభిమానికి థాంక్స్ చెప్పి తనకి ఇలాంటి మంచి పనులు చేయడానికి స్పూర్తినిచ్చిన వాళ్లు మహేష్ బాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి, ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల అని చెప్పింది. ఇది చూసిన నెటిజన్లు ఇంత చిన్న వయసులోనే ఇలా స్వచ్ఛందంగా సహాయం చేయడం చాలా గొప్ప విషయం అని క్రితికను అభినందిస్తున్నారు.


End of Article

You may also like