ప్రేమించి.. పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేసారు.. కానీ ఇలా జరిగేసరికి దారుణానికి పాల్పడ్డారు.. అసలేమైందంటే..?

ప్రేమించి.. పెళ్లి చేసుకోవడానికి ధైర్యం చేసారు.. కానీ ఇలా జరిగేసరికి దారుణానికి పాల్పడ్డారు.. అసలేమైందంటే..?

by Megha Varna

Ads

ప్రేమలో పడడం.. ఇంట్లో ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటివి తరచూ మనం వింటూనే ఉంటాం. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలో ఇది చోటు చేసుకుంది. పెళ్ళికి ఇంట్లో అంగీకరించకపోవడంతో ఆత్మహత్య  చేసుకున్నారు. రేగిడి మండలం తునివాడ గ్రామానికి చెందిన హరీష్ (29), దివ్య (21) ఎదురిళ్ళల్లో ఉండేవారు.

Video Advertisement

ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఎంబీఏ పూర్తి చేసిన హరీష్ ఉద్యోగ ప్రయతంలలో వున్నాడు. దివ్య విజయనగరంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇద్దరు తరచూ మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకోవడం జరిగేది. ఇలా ఇద్దరి మధ్య ప్రేమ నడిచేది. అయితే ఇంట్లో ప్రేమ గురించి ఓ రోజు చెప్పేసారు. కానీ పెద్దలు ఒప్పుకోలేదు. అమ్మాయికి సంబంధాలు చూడడం మొదలుపెట్టడంతో ఆమె హరీష్‌కు తెలిపింది.

lovers 1

దీనితో పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సెప్టెంబర్ 1న అన్నవరంలో ఈ జంట ఒకటయ్యారు. విశాఖపట్నంలో ఓ అద్దె ఇల్లు తీసుకుని నూతన జీవితాన్ని మొదలుపెట్టారు. రెండు నెలల పాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత సొంత ఊరు వెళితే పెద్దలు ఒప్పుకుంటారని నమ్మకం వచ్చింది. దీనితో దివ్య, హరీష్ బుధవారం మధ్యాహ్నానికి తునివాడ వెళ్లారు. అయితే ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ మేడ మీద ఉన్న గదిలోకి ఈ జంట వెళ్లి ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

lovers 2

ఇంతలో బంధువుల అబ్బాయి హరీష్ ఫోన్ మర్చిపోయాడు అని వెళ్ళాడు. ఇంకేం వుంది.. జరిగింది చూసి అందరికీ చెప్పాడు. అయితే హరీష్ ఇంటికెళ్ళి తప్పు చేశానని తన తల్లిని పట్టుకుని ఏడ్చాడు అన్న సంగతి బయటపడింది. అలానే విశాఖలో ఉన్నప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు కూడా హరీష్ చేశాడని తెలిసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం కూడా వచ్చింది. పెళ్లి తర్వాత వచ్చిన వాళ్ళని రెండు కుటుంబాలు ఆదరించకపోవడం వల్లే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.


End of Article

You may also like