బంగార్రాజులో ఈ “పొరపాటు” గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు..?

బంగార్రాజులో ఈ “పొరపాటు” గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు..?

by Mohana Priya

Ads

నాగార్జున హీరోగా వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” సినిమా ఓ రేంజ్ లో హిట్ అయింది. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని… ఇటు మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుంది అని అప్పుడే ప్రకటించారు. అప్పటినుంచి సీక్వెల్ ఎలా ఉండబోతోందా? అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది.

Video Advertisement

ఈ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు విడుదలకి సిద్ధమయ్యాయి. కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని సినిమాలు వెనకడుగు వేశాయి. బంగార్రాజు మాత్రం మొదటి నుండి సంక్రాంతి బరిలోనే ఉంది. ఏ సినిమా విడుదల అయినా కాకపోయినా మా సినిమా మాత్రం కచ్చితంగా సంక్రాంతికే విడుదల అవుతుంది అని సినిమా బృందం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు.

bangarraju movie review

అయితే ఈ సినిమాలో ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అది ఏంటంటే సినిమా మొదటిలో రాము భార్య సీత బిడ్డకి జన్మనిచ్చి చనిపోయినట్టు చూపిస్తారు. ఆ తర్వాత బంగార్రాజు స్వర్గంలో ఉన్నపుడు చనిపోయిన సత్తెమ్మ కూడా అక్కడకి వెళుతుంది. అయితే సత్తెమ్మ కంటే ముందు సీత చనిపోయింది. అలాంటప్పుడు సీత ఎందుకు కనిపించలేదు అని అంటున్నారు నెటిజన్లు.

bangarraju movie review

ఇంక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం బంగార్రాజు సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో సంబంధం లేకుండా సినిమా విడుదల చేసి రిస్క్ చేశారు. కానీ ఒక రకంగా ఆ రిస్క్ వారికి కలిసొచ్చింది. ఇందులో నాగ చైతన్య పక్కన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటించారు. సినిమాకి మెయిన్ హైలైట్ మాత్రం నాగార్జున. కొద్ది సంవత్సరాల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనాలో నాగార్జున నటన చాలా మందికి నచ్చింది. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించడం కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి ఒక కారణం అయ్యింది. పండగకి విడుదలైన పెద్ద సినిమా ఇది ఒక్కటే కావడంతో, అది కూడా పండగకి సరిపోయే సినిమా కావడంతో ప్రేక్షకులు బంగార్రాజు సినిమాని ఆదరిస్తున్నారు.


End of Article

You may also like