Ads
2015 లో వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా భజరంగీ భాయిజాన్. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ నటించిన ఈ సినిమాకి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. కె. వి. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ సినిమాలో మున్ని (షాహిదా) పాత్రలో నటించిన అమ్మాయి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.
Video Advertisement
తన పేరు హర్షాలీ మల్హోత్రా. 2008 లో జన్మించిన హర్షాలీ మల్హోత్రా కుబూల్ హై,లౌట్ ఆవో త్రిష సీరియల్స్ లో నటించింది. అలాగే సావధాన్ ఇండియా లో కూడా నటించింది. అంతే కాకుండా ఫేర్ అండ్ లవ్లీ, పియర్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హార్లిక్స్ లాంటి అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా నటించింది.
2015 లో బజరంగీ భాయిజాన్ సినిమాతో, సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమాతో ఒక్క బాలీవుడ్ లో మాత్రమే కాకుండా నేషనల్ వైడ్ గా అభిమానులను సంపాదించుకుంది హర్షాలీ మల్హోత్రా. తర్వాత నాస్తిక్ అనే ఒక సినిమాలో నటించింది.
దివాలి సందర్భంగా పండుగను జరుపుకుంటున్న ఫోటోలను ఇటీవల హర్షాలీ మల్హోత్రా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత హర్షాలీ మల్హోత్రా మళ్లీ మన ముందుకు రావడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#1 #2
#3
#4
End of Article