”బాలకృష్ణ” కి వర్క్ అవుట్ అయిన ఆ సెంటిమెంట్…అదేంటంటే..?

”బాలకృష్ణ” కి వర్క్ అవుట్ అయిన ఆ సెంటిమెంట్…అదేంటంటే..?

by Megha Varna

Ads

బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఈ మధ్యకాలంలో వచ్చిన బాలయ్య సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. మంచి విజయాలని అందుకున్నారు బాలకృష్ణ. బాలయ్య వరుసగా చాలా మంది డైరెక్టర్లతో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి సినిమా పూర్తి అయిన తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Video Advertisement

అలానే బాబి డైరెక్షన్లో ఒక సినిమా బాలయ్య చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఒక సినిమా రాబోతోందట.

balayya fan wants him to attend his wedding..

ఇలా వరుస సినిమాలతో బాలయ్య బాగా బిజీ అయిపోయారు. నిజానికి దర్శకులు సినిమా మీద హోప్ పెట్టి సినిమాని తీస్తారు కానీ దర్శకులు అనుకున్నట్లుగా సినిమాలు అన్నీ కూడా సక్సెస్ ని అందుకోలేవు. కొన్ని సినిమాలు హిట్ అయితే కొన్ని సినిమాలు డిజాస్టర్స్ గా మారిపోయే అవకాశం ఉంది. కానీ ఏ సినిమా కూడా హిట్ అవుతుందని విడుదల అయ్యేదాకా ఎవరూ చెప్పలేరు. బాలకృష్ణకి మాత్రం ఒక సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందట అదేంటంటే డ్యూయల్ రోల్.

balayya-babu-akhanda-news

బాలయ్య డ్యూయల్ రోల్ లో చేస్తే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనేది కొత్త సెంటిమెంట్. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తే సినిమా పక్కా హిట్ అవుతుందని భావిస్తున్నారు కానీ నిజానికి అది కూడా మనం చెప్పలేము. బాలయ్య డ్యూయల్ రోల్ చేసి ఒక రోల్ ఊహించని స్థాయిలో ఎంతో పవర్ఫుల్ గా ఉంటే మాత్రం సినిమా పక్క హిట్ అవుతుందని చాలా సార్లు ప్రూవ్ అయింది.

సింహ, లెజెండ్, వీరసింహా రెడ్డి, అఖండ సినిమాలు ఈ విషయాన్ని నిజం చేసాయి. మరి బాలయ్య రాబోయే సినిమాలు కూడా అదే విధంగా ఉంటాయా అనేది చూడాల్సి వుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా వస్తున్న సినిమాలో మాత్రం బాలయ్య ద్విపాత్రాభినయం చేయట్లేదు కేవలం సింగిల్ రోల్ చేస్తున్నారు. బాలయ్య బోయపాటి అఖండ సీక్వెల్ రాబోతుంది. ఈ సినిమా ఇంకో లెవెల్ లో ఉంటుందని సమాచారం అఖండ ఎక్కడైతే ఆగిపోయిందో అఖండ సీక్వెల్ దాని నుండి స్టార్ట్ అవుతుందట. ఆ మూవీ ని100 కోట్లు బడ్జెట్ తో తీసుకురాబోతున్నారు.


End of Article

You may also like