Ads
హీరో నందమూరి బాలకృష్ణ ఇటు సినిమాలలోనూ ,అటు రాజకీయాలలోని ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఒక వైపు హిందూపూర్ యంఎల్ఏ కొనసాగుతూ ,భాస్వతారకం కాన్సర్ ఆసుపత్రికి ని కూడా చూసుకుంటూ తన సేవలను అందిస్తున్నారు.అయితే నందమూరి బాలకృష్ణ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తావన గురించి తన అభిప్రాయాన్ని తెలిపారు..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..
Video Advertisement
మీరు ,చంద్ర బాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలలో కొనసాగుతున్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా పూర్తిగా రాజకీయాలలోకి వస్తే తెలుగు దేశం పార్టీ కి రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్వ వైభం వస్తుంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు దీనిపై మీ స్పందన ఏంటి అని యాంకర్ బాలకృష్ణ ను అడిగారు.పూర్తి స్థాయిలో రాజకీయాలలోకి రావడం అంటే వారి వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది అని బాలకృష్ణ అన్నారు.
కాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో విజయాలను అందుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇలాంటి సమయంలో సినిమాలను వదిలేసి రాజకీయాలలోకి రమ్మని మేము చెప్పలేము అని బాలకృష్ణ అన్నారు.అప్పట్లో నాన్నగారు కూడా సీఎం గా చేస్తూ బ్రహ్మరిషి ,విశ్వ మిత్ర లాంటి సినిమాలు చేసారు.నేను కూడా రాజకీయాలలో కొనసాగుతూనే సినిమాలలో కూడా నటిస్తున్నాను అని బాలకృష్ణ అన్నారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రాజకీయ ప్రస్తావన తీసుకురాలేదు.కాగా వరుస సినిమాలు చేయుకుంటూ ముందుకు వెళ్తున్నారు.అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ద్రుష్టి అంతా సినిమాల మీదే ఉంది అని రాజకీయాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించట్లేదు అని జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు చెప్తున్నారు.
End of Article