Ads
హీరో నందమూరి బాలకృష్ణ ఇటు సినిమాలలోనూ ,అటు రాజకీయాలలోని ముందుకు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఒక వైపు హిందూపూర్ యంఎల్ఏ కొనసాగుతూ ,బసవతారకం కాన్సర్ ఆసుపత్రికి ని కూడా చూసుకుంటూ తన సేవలను అందిస్తున్నారు.
Video Advertisement
తాజాగా ఓ ఇంటర్వ్యూలో “మీరు మీ నాన్నగారికి భయపడేవారు అంట కదా? అలాగే మీ ఇంట్లో ఇంకెవరికి మీరు భయపడతారు?” అని అడిగితే…”నా కూతురుకి భయపడతా…బ్రాహ్మణి లేనప్పుడు నా మనవడితో కలిసి అల్లరి చేస్తా. నా మనవడికి కూడా నా కూతురంటే భయమే. ఏ విషయాన్ని అయినా చాలా కూల్ గా చెబుతుంది నా కూతురు. చాలాబ్యాలెన్స్‌డ్. ఆమె వల్లే నాకు సహనం అలవడింది.అందుకే తను ఏం చెప్పినా వింటాను” అంటూ బాలయ్య సమాధానం ఇచ్చారు.
అలాగే మరొక ఇంటర్వ్యూలో…”మీరు ,చంద్ర బాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ కూడా పూర్తి స్థాయిలో రాజకీయాలలో కొనసాగుతున్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా పూర్తిగా రాజకీయాలలోకి వస్తే తెలుగు దేశం పార్టీ కి రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్వ వైభం వస్తుంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు దీనిపై మీ స్పందన ఏంటి అని యాంకర్ బాలకృష్ణ ను అడిగారు.పూర్తి స్థాయిలో రాజకీయాలలోకి రావడం అంటే వారి వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది అని బాలకృష్ణ అన్నారు.
కాగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో విజయాలను అందుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇలాంటి సమయంలో సినిమాలను వదిలేసి రాజకీయాలలోకి రమ్మని మేము చెప్పలేము అని బాలకృష్ణ అన్నారు.అప్పట్లో నాన్నగారు కూడా సీఎం గా చేస్తూ బ్రహ్మరిషి ,విశ్వ మిత్ర లాంటి సినిమాలు చేసారు.నేను కూడా రాజకీయాలలో కొనసాగుతూనే సినిమాలలో కూడా నటిస్తున్నాను అని బాలకృష్ణ అన్నారు.
End of Article