“జయంతి” గారి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు-నందమూరి బాలకృష్ణ

“జయంతి” గారి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు-నందమూరి బాలకృష్ణ

by Mohana Priya

Ads

సినీ నటి జయంతి గారి మృతిపై నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. జయంతి గారు, బాలకృష్ణతో, అలాగే నందమూరి తారక రామారావు గారితో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. బాలకృష్ణ మాట్లాడుతూ “జయంతి గారు గొప్ప నటి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక తరాలతో కలిసి పని చేసిన సీనియర్ నటీమణి. నాన్నగారి జగదేకవీరుని కథ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై, తర్వాత కులగౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి వంటి అజరామరమైన చిత్రాల్లో కలిసి నటించారు”.

Video Advertisement

balakrishna extends his condolences on jayanthi demise

“నేను హీరోగా నటించిన అల్లరి కృష్ణయ్య, ముద్దుల మేనల్లుడు, తల్లితండ్రులు వంశానికొక్కడు చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేశారు. ప్రేక్షకులు అందరి మన్ననలు అందుకున్నారు. ఆమె మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు పెద్ద లోటుగా భావిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆత్మ స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.


End of Article

You may also like