Home Filmy Adda మరొక కొత్త ప్రయోగం చేయబోతున్న “బాలయ్య”..? ఆ దర్శకుడితో సినిమా..?

మరొక కొత్త ప్రయోగం చేయబోతున్న “బాలయ్య”..? ఆ దర్శకుడితో సినిమా..?

by Mohana Priya

అటు సినిమాలూ చేస్తూ, ఇటు టాక్ షో హోస్ట్ చేస్తూ బిజీగా ఉన్న నటుడు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి.

ఈ సినిమాలో ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా సినిమాలో ఒక పాత్రలో నటిస్తున్నారు. తన పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో, అలాగే ఇప్పుడు ఉన్న టైంలో కూడా కనిపిస్తుంది అని, అందుకోసం తాను 15 కిలోల బరువు తగ్గాను అని వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పారు. ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

first guest in balakrishna unstoppable program

అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తారు అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలకృష్ణ మరొక యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో కూడా నటిస్తారు అనే వార్తలు వస్తున్నాయి. కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న వెంకటేష్ మహా దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్నారు అని ఒక వార్త బయటకు వచ్చింది. వెంకటేష్ మహా బాలకృష్ణని కలిసి స్టోరీ చెప్పడానికి ఆసక్తి చూపుతున్నారు అని అంటున్నారు. ఒకవేళ బాలకృష్ణకు స్టోరీ నచ్చి సినిమా చేస్తే ఈ కాంబినేషన్ నిజంగా ఒక కొత్త కాంబినేషన్ అవుతుంది. ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే.

You may also like