కరోనా దెబ్బకు తోపుడుబండిపై కూరగాయలు అమ్ముకుంటున్న దర్శకుడు…కంటతడి పెట్టించే సంఘటన.!

కరోనా దెబ్బకు తోపుడుబండిపై కూరగాయలు అమ్ముకుంటున్న దర్శకుడు…కంటతడి పెట్టించే సంఘటన.!

by Mohana Priya

Ads

గత కొన్ని నెలల నుండి ఎంతోమంది పరిస్థితులు మారిపోయాయి. వాళ్లలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే షూటింగ్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అన్ని జాగ్రత్తలతో మొదలు పెడుతున్నారు. అయితే ఇటీవల ఎంటర్టైన్మెంట్ రంగాని కి చెందిన ఒక వ్యక్తి లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో, కూరగాయలు అమ్మే వ్యాపారం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.

Video Advertisement

బాలికా వధు సీరియల్ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. బాల్య వివాహాల మీద వచ్చిన ఈ సీరియల్ ఒక ట్రెండ్ సృష్టించింది. బాలికా వధు సీరియల్ చాలా భాషల్లో డబ్ అయింది. తెలుగులో చిన్నారి పెళ్లికూతురు పేరుతో ఈ సీరియల్ ప్రసారం అయ్యేది. ఒక డైరెక్ట్ తెలుగు సీరియల్ కి ఎంత ఆదరణ అయితే లభిస్తుందో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ కి కూడా అంతే ఆదరణ లభించింది.

బాలికా వధు డైరెక్టర్లలో రామ్ వృక్ష గౌర్ ఒకరు. ఒక సినిమా రెక్కీ కోసం ఆజంగఢ్ కి వెళ్లారట రామ్ వృక్ష గౌర్. అప్పుడే లాక్ డౌన్ అనౌన్స్ చేశారట. తిరిగి వచ్చే అవకాశం లేకపోవడంతో పాటు రామ్ వృక్ష గౌర్ ఏ ప్రాజెక్టు కోసమైతే పని చేస్తున్నారో ప్రాజెక్ట్ ఆగిందట, ప్రాజెక్టుని తిరిగి మళ్ళి ప్రారంభించడానికి సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది అని ప్రొడ్యూసర్ చెప్పారట. దాంతో తన తండ్రి వ్యాపారాన్ని చూసుకుందామని నిర్ణయించుకున్నారట రామ్ వృక్ష గౌర్.

రామ్ వృక్ష గౌర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ, 2002లో తన స్నేహితులు, ఇంకా రైటర్ షానవాజ్ ఖాన్ సహాయంతో ముంబై కి వెళ్లానని, తర్వాత టీవీ సీరియల్స్ లో ముందు లైట్ డిపార్ట్మెంట్ లో ఆ తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశానని, ముందు ఎన్నో సీరియల్స్ ప్రొడక్షన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించానని, తర్వాత బాలికా వధు కి యూనిట్ డైరెక్టర్ గా  ఉన్నాను అని,

ముంబైలో తనకి సొంత ఇల్లు ఉంది అని, ఒక రోజు తిరిగి వెళ్తాను అనే నమ్మకం ఉంది అని, అప్పటి వరకూ ఇక్కడ ఏది చేయగలిగితే అది చేస్తున్నాను అని చెప్పారు.  రామ్ వృక్ష గౌర్ లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఒక భోజ్ పురి సినిమాకి, ఆ తర్వాత ఒక హిందీ సినిమాకి పని చేయనున్నారట.

 


End of Article

You may also like