Ads
శ్రీ ఎస్ పీ బాలసుబ్రమణ్యం గారు సెప్టెంబర్ 25 వ తేదీ మధ్యాహ్నం స్వర్గస్థులయ్యారు. బాలు గారు జూన్ 4 న , 1946 లో జన్మించారు. గాయకుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా కూడా ఎంతో పేరు సంపాదించారు బాలు గారు. సినీ సంగీతం లో ఆయన కృషి ని ప్రశంసిస్తూ జాతీయ ప్రభుత్వం 2001 లో పద్మశ్రీ ని, 2011 లో పద్మ భూషణ్ ని ప్రకటించింది. బాలు గారు ఆరు సార్లు జాతీయ స్థాయి లో ఉత్తమ గాయకుడిగా అవార్డును అందుకున్నారు.
Video Advertisement
కొద్ది రోజుల క్రితం తనకి కరోనా పాజిటివ్ వచ్చింది అని, ట్రీట్మెంట్ తీసుకోబోతున్నాను అని, త్వరలోనే మళ్ళీ మామూలు గా అవుతాను అని సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు బాలు గారు. ఆ వీడియోలో బాలు గారు ఈ విధంగా మాట్లాడారు ” నేను బాలసుబ్రమణ్యం. గత రెండు మూడు రోజుల నుండి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది అంటే చెస్ట్ కంజెషన్. ఒక సింగర్ కి అది నాన్సెన్స్ (అంత పెద్ద సమస్య ఏమీ కాదు అని అర్థం). కొంచెం జలుబు, జ్వరం వస్తూ ఉన్నాయి. అంతే. ఇవి తప్ప నాకు వేరే సమస్యలు లేవు.
కానీ నేను ఈజీగా తీసుకోదల్చుకోలేదు. హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ చేయించుకుంటే చాలా మైల్డ్ కరోనా పాజిటివ్ అని చెప్పారు. నేను హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఎవరూ దీని గురించి ఆందోళన చెందవద్దు. నాకు కాల్స్ చేసి నా గురించి తెలుసుకోవాలనుకున్నందుకు థాంక్యూ. ఒకవేళ నేను కాల్ అటెండ్ అవ్వకపోతే ఏమీ అనుకోవద్దు. నేను బాగున్నాను. నేను బాగుంటాను” అని అన్నారు.
watch video:
End of Article