Ads
శ్రీ ఎస్ పీ బాలసుబ్రమణ్యం గారు నిన్న మధ్యాహ్నం స్వర్గస్థులయ్యారు. బాలు గారు జూన్ 4 న , 1946 లో జన్మించారు. గాయకుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా కూడా ఎంతో పేరు సంపాదించారు బాలు గారు. సినీ సంగీతం లో ఆయన కృషి ని ప్రశంసిస్తూ జాతీయ ప్రభుత్వం 2001 లో పద్మశ్రీ ని, 2011 లో పద్మ భూషణ్ ని ప్రకటించింది. బాలు గారు ఆరు సార్లు జాతీయ స్థాయి లో ఉత్తమ గాయకుడిగా అవార్డును అందుకున్నారు.
Video Advertisement
కొద్ది రోజుల క్రితం తనకి కరోనా పాజిటివ్ వచ్చింది అని, ట్రీట్మెంట్ తీసుకోబోతున్నాను అని, త్వరలోనే మళ్ళీ మామూలు గా అవుతాను అని సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు బాలు గారు. తర్వాత ఒక సమయంలో బాలు గారి ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది అనే వార్తలు వచ్చాయి. కానీ తర్వాత బాలు గారికి కరోనా నెగిటివ్ వచ్చింది అని ప్రకటించారు. సెప్టెంబర్ 24వ తేదీన బాలు గారి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉంది అని ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం ఒక రిపోర్ట్ విడుదల చేసింది. తర్వాత బాలుగారు లేదన్న వార్తని నిన్న మధ్యాహ్నం చెప్పారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో బాలు గారు తన స్వహస్తాలతో రాసిన లెటర్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ లెటర్ లో “శ్రీ ప్రకాష్ గారికి, విజయదశమి శుభాకాంక్షలు. నవంబర్ 30న మీ కార్యక్రమంలో తప్పక పాల్గొనగలను. కొన్ని చిన్నచిన్న అభ్యర్థనలను మన్నించక తప్పదు. దయచేసి నా పేరు ముందు “డాక్టర్”, “పద్మభూషణ్”, “గాన గంధర్వ” లాంటి విశేషణలు వేయకండి. మనకు ఇంకా వ్యవధి ఉంది కాబట్టి ప్రయాణ వివరాలు తర్వాత తెలుపగలరు” అని రాసి ఉంది.
End of Article