Ads
Bandla Ganesh: ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బండ్ల గణేష్ మీడియాని ఆకర్షించే ఏ అవకాశాన్ని వృధా చేయడు. తాజాగా బండ్ల గణేష్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిలో బండ్ల గణేష్ మరియు అల్లు అర్జున్ అన్న బాబీ ఉన్నారు.
Video Advertisement
ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా బండ్ల తనదైన గణేష్ ముద్ర వేస్తుంటాడు. ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆయన చేసిన ప్రసంగాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్, చిరంజీవిల పై చూపించే ప్రేమ, అతనికి మెగా అభిమానులలో ప్రత్యేక క్రేజ్ ను తెచ్చింది. తాజాగా బండ్ల గణేష్ డైరెక్టర్ గుణశేఖర్ కుమార్తె పెళ్ళికి హాజరయ్యారు. మ్యారేజ్ రిసెప్షన్ సందర్భంగా, బండ్ల గణేష్ అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీని కలిశాడు. ఇక అక్కడ బాబీని అల్లు అర్జున్ తో పోల్చుతూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలను అక్కడ ఉన్నవారు మొబైల్‌లో రికార్డ్ చేయగా,ఆ వీడియో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో బాబీ విదేశాల్లో చదువు కొనసాగించాడని బండ్ల గణేష్ చెప్పాడు. అల్లు బాబీ విద్యావంతుడని, తన తండ్రి అల్లు అరవింద్‌కు విధేయత చూపుతాడని,కానీ అల్లు అర్జున్ తన తండ్రి మాటని పట్టించుకోలేదని, అయితే నేడు అల్లు అర్జున్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడని గణేష్ అన్నారు. అందుకే తండ్రి మాట విన్నవారు అల్లు బాబీలా, తండ్రి మాట వినని వారు, తమకు నచ్చినట్టు చేస్తే అల్లు అర్జున్‌లా అవుతారని బండ్లన్న చెప్పుకొచ్చారు. బాబీ గారు అవ్వాలా, బన్నీగారు అవ్వాలా మీరు నిర్ణయించుకోండని బండ్ల గణేష్ అన్నారు.వీరిని ఉదాహరణగా చెప్తూ ప్రతి ఒక్కరూ కూడా తమ మనసు చెప్పినట్టు వెళ్లాలని బండ్ల గణేష్ కోరారు. ఈ వీడియోతో బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్ తమ అభిమాన స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నిర్మించాలని చాలా మంది మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
End of Article