Ads
బండ్ల గణేష్ కి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బండ్ల గణేష్ తాను పవన్ కళ్యాణ్ కి అభిమాని అని చాలా సందర్భాల్లో చెప్పారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ ఈవెంట్ ఉన్నా కూడా బండ్ల గణేష్ ఆ ఈవెంట్ కి వస్తారు. అలాగే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కలిసి కొన్ని సినిమాల్లో కూడా నటించారు.
Video Advertisement
పవన్ కళ్యాణ్ నటించిన కొన్ని సినిమాలను కూడా బండ్ల గణేష్ నిర్మించారు. అందులో గబ్బర్ సింగ్ కూడా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. అయితే ఇటీవల బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంతకుముందు బండ్ల గణేష్ ఇంట్లో తనది, పవన్ కళ్యాణ్ ది ఒక ఫోటో ఉండేది.
కానీ ఇప్పుడు ఆ ఫోటో స్థానంలో మరొక ఫోటో ఉంది. తన తల్లిదండ్రులు ఉన్న ఫోటోని బండ్ల గణేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలో బండ్ల గణేష్ కూడా ఉన్నారు. దాంతో ఈ ఫోటో చూసిన నెటిజన్లు అందరూ అంతకు ముందు అదే స్థానంలో పవన్ కళ్యాణ్ ఫోటో ఉండేది కదా అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ కూడా తన సినిమా అయిన డేగల బాబ్జీ ప్రమోషన్స్ పనిలో ఉన్నారు.
End of Article