నటుడు నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్ ని ఎంతగా అభిమానిస్తారో మనందరికీ తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీన రాబోతోంది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో నిర్మించిన గబ్బర్ సింగ్ సినిమాని థియేటర్లలో ప్రదర్శిస్తాము అని చెప్పారు.

bandla ganesh

ఇది చూసిన నెటిజన్లు గబ్బర్ సింగ్ సినిమాని తమ ప్రాంతాల్లో కూడా ప్రదర్శించాలని కోరారు. సోషల్ మీడియాలో బండ్ల గణేష్ ని తమ ప్రాంతాల్లో గబ్బర్ సింగ్ సినిమాని ప్రదర్శించండి అని అడిగారు. అయితే, ఒక ట్విటర్ యూజర్, “అదే చేత్తో మా అమలాపురంలో కూడా ఒక షో వేయించండి” అని అడిగారు. అందుకు బండ్ల గణేష్, “దయచేసి మీరందరూ మీ ఊర్లో థియేటర్ బుక్ చేసుకోండి. నేను పర్మిషన్ ఇస్తాను” అని హామీ ఇచ్చారు.