తాజాగా బెంగుళూర్ లో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో బెంగుళూరువాసులు భయబ్రాంతులకు లోనయ్యారు.ఆ శబ్దం బెంగుళూరు లోని వైట్ ఫీల్డ్ నుండి వచ్చినట్లు తెలుస్తుంది.ఆ శబ్దం దాదాపు 17 కిలోమీటర్ల వరకు వినిపించింది.మొదటగా స్థానికులు ఏదో పెద్ద విపత్తు జరిగింది ఎక్కడో భారీ పేలుడు జరిగింది అనుకున్నారు. కానీ ప్రాణనష్టం ఏమి సంభవించలేదు.పోలీసులు కూడా ప్రాణనష్టం జరిగినట్లు మాకు ఎటువంటి సమాచారం రాలేదని తెలిపారు.

ఆ తర్వాత తెలిసింది ఏంటి అంటే అటు వైపుగా కొన్ని ఫైటింగ్ జెట్స్ ట్రైనింగ్ నిమిత్తం వెళ్తున్నాయి.వాటిలో ఒక జెట్ సోనిక్ బూమ్ ను విడుదల చేసింది.దానివలన వచ్చిన శబ్దాన్ని మొదటగా ఏదో భారీ ప్రమాదం జరిగింది అనుకున్నారు.సోనిక్ బూమ్ ఎలా వస్తుంది అంటే జెట్ అమిత వేగంతో ప్రయాణించినప్పుడు షాక్ తరంగాల వలన ఎక్కువ శక్తీ ఉత్త్పత్తి అయ్యి పెద్ద సౌండ్ వస్తుంది.

ఏదైనా ఒక వస్తువు గాలిలో వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు దాని ముందు మరియు వెనకాల కూడా ఒత్తిడికి గురి అవుతుంది.తద్వారా విడుదల అయినా శక్తీ శబ్ద తరంగాల రూపంలో బయటకి విడుదల అవుతుంది.జెట్ నుండి సోనిక్ బూమ్ కూడా అదే విధంగా విడుదల అయ్యింది.

ఈ నేపథ్యంలో సూపర్ సోనిక్ సౌండ్ గురించి తెలుసుకోవాలి.జెట్ స్పీడ్ ఆ శబ్ద తరంగాల కంటే కూడా వేగంగా ప్రయాణిస్తుంది కావున ఆ జెట్ వెళ్ళిపోయినా కొద్ది సేపటి తర్వాత మాత్రమే ఆ సౌండ్ ను ఎవరైనా వినగలుగుతారు.ఎందుకంటే శబ్ద తరంగాలు గాలిలో ప్రయాణించి మనకు వినపడడానికి కొంచెం సమయం పడుతుంది అని తెలుస్తుంది.దినిమిద ప్రో బెంగుళూరు మినిస్టరీ ట్విట్టర్ లో స్పందిస్తూ సిటీ చివరి ప్రదేశంలో జెట్స్ ట్రైనింగ్ నిమిత్తం వెళ్లాయని అందుకే సోనిక్ బూమ్ వెలువడిందని తెలిపారు.జెట్స్ సూపర్ సోనిక్ వేగంతో 36 ,000 మరియు 40 ,000 అడుగుల ఎత్తులో ఈ సోనిక్ బూమ్ వెలువడింది అని తెలిపారు.

Bengaluru Boom Sound

Here is the sample of Bengaluru Boom Sound. Kindly note this is the edited video from twitter user. So apparently this sound is of the #sonicboom from Mirage 2000(not confirmed yet) that was heard in Update awaited. #blastsound #boomsound #Donotpanic

Whitefield BLR ಅವರಿಂದ ಈ ದಿನದಂದು ಪೋಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ ಬುಧವಾರ, ಮೇ 20, 2020

ఇది ఇలా ఉండగా…ఆ వింత శబ్దంపై సోషల్ మీడియాలో పలు ట్రోల్ల్స్ వచ్చాయి. గ్రహాంతర వాసులు వచ్చారా అంటూ కొందరు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టీం ఫాన్స్ కాల్చిన టపాసులు అంటూ కొందరు ట్రోల్ చేసారు. ఆ ట్రోల్ల్స్ చూసి నవ్వుకోండి.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

Sharing is Caring:
No more articles