“బంగారం” సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి..!

“బంగారం” సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి..!

by Megha Varna

దాదాసాహెబ్ సినిమాలో సనూష చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తర్వాత ఆమెకి మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ బంగారం సినిమాలో కూడా సనూష చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. విద్యా రెడ్డికి చెల్లిగా సనూష నటించి ఎంతో బాగా ఆకట్టుకుంది. 2000 సంవత్సరంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది.

Video Advertisement

sanusha

ఈమెకి 2012లో హీరోయిన్ దా కూడా అవకాశాలు వచ్చాయి. మిస్టర్ మురుగన్ అనే చిత్రానికి ఈమె తొలి సారిగా హీరోయిన్ పాత్రలో నటించింది. అదే విధంగా జీనియస్, రేణిగుంట సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది ఈ ముద్దుగుమ్మ. ఇలా ఆమె పలు సినిమాలు చేసి ఎంతగానో ఆకట్టుకుంది. నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాలో కూడా ఈమె నటించింది. జర్నలిస్ట్ పాత్రలో సనూష ప్రేక్షకులకి దగ్గరయింది.

మాలీవుడ్ లో ఈమెకి హీరోయిన్ గా మంచి అవకాశాలు వచ్చాయి. అయితే కొంత కాలం క్రితం ఈమె బాధలోకి వెళ్లడం.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని ఈమె అనుకుంది. మానసిక వైద్య నిపుణుల సహాయంతో తిరిగి మళ్ళీ ఈమె కోలుకుంది.

sanusha 1

మలయాళం లో వచ్చే ప్లవర్ టీవీలో రెండు ప్రోగ్రాంస్ కి కూడా ఈమె మెంటర్ గా చేస్తోంది. అలానే మనోరమ హెల్త్ మ్యాగజిన్ కోసం ఫోటో షూట్ కూడా చేసింది. ఈ ఫోటోని ఫోటో గ్రాఫర్ శ్యాంబాబు చేశారు. చీరలో ఎంతో అందంగా, బొద్దుగా ఈమె కనపడింది. నిజంగా ఈమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. సనూష సంతోష్ వీడియో చూసి నేటిజన్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు.

sanusha 4

 

sanusha 3

 

sanusha 2


You may also like