పెళ్లైన వారం రోజుల తర్వాత ఎమోషనల్ పోస్ట్ చేసిన బర్రెలక్క…అందులో ఏముందంటే.?

పెళ్లైన వారం రోజుల తర్వాత ఎమోషనల్ పోస్ట్ చేసిన బర్రెలక్క…అందులో ఏముందంటే.?

by Mohana Priya

Ads

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అవుతున్నారు. అయితే చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు సినిమాల్లోకి వెళ్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి, తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆమె బర్రెలక్క అలియాస్ శిరీష. డిగ్రీ చదివినా కూడా తనకి ఉద్యోగం రాకపోవడంతో బర్రెల వ్యాపారం చేస్తున్నాను అని ఒక వీడియో చేసి, ఆ వీడియో ద్వారా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఎంతో మందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. బర్రెలక్క ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. కానీ ఓట్లు ఎక్కువగా రాకపోవడంతో గెలవలేకపోయారు.

Video Advertisement

barrelakka

అయితే ఈసారి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పాల్గొంటాను అని చెప్పారు. ఇటీవల బర్రెలక్క పెళ్లి ఘనంగా జరిగింది. నాగర్ కర్నూల్ కి చెందిన వెంకటేష్ అనే వ్యక్తితో బర్రెలక్క పెళ్లి జరిగింది. బర్రెలక్క, వెంకటేష్ దగ్గర బంధువులు. అలా వారి పరిచయం ఏర్పడింది. అయితే వీరి పెళ్లి జరిగి దాదాపు వారం రోజులు అయ్యింది. ఈ క్రమంలో బర్రెలక్క సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం చర్చల్లో నిలిచింది. బర్రెలక్క తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ షేర్ చేశారు. “ఒక అమ్మాయికి గాయం అయితే, గాయం చేసిన వాళ్ళని ఏమీ అనరు. కానీ గాయపడ్డ వాళ్ళని మాత్రం మాటలతో చంపుతారు.”

barrelakka emotional post after marriage

“అమ్మాయి ధైర్యంగా బయటకి నడవడానికి ఉండదు. మంచోళ్ళు ఉన్నారు. చెడ్డోళ్ళు ఉన్నారు. ప్రతి అమ్మాయిలో తన అమ్మని చూస్తే తప్పు చేయాలి అనే ఆలోచన రాదు. ఒక అమ్మాయి ఇలా మూసుకొని దాక్కునే పరిస్థితి రాదు. తప్పు చేసిన వాళ్ళు బయట బాగానే ఉన్నారు. ఏ తప్పు చేయని అమ్మాయిలు బాధపడుతున్నారు” అంటూ ఒక పోస్ట్ షేర్ చేశారు. దీని వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది తెలియదు. అయితే ఈ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయడంతో, “బర్రెలక్క చెప్పింది కరెక్ట్” అంటూ చాలా మంది ఏకీభవిస్తున్నారు. “దీని వెనుక వ్యక్తిగత కారణాలు ఏమీ లేవు” అని, “కేవలం అందులో ఉన్న మెసేజ్ మాత్రమే షేర్ చేశారు” అని అంటున్నారు.

ALSO READ : ఈ 12 మంది ఇప్పుడు స్టార్స్…కానీ ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేసారని మీకు తెలుసా.?


End of Article

You may also like