“పెళ్లి చేసుకుంటున్నప్పుడు కూడా ఈ కష్టాలు ఏంటక్కా..?” అంటూ… బర్రెలక్క మీద కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

“పెళ్లి చేసుకుంటున్నప్పుడు కూడా ఈ కష్టాలు ఏంటక్కా..?” అంటూ… బర్రెలక్క మీద కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

by Mohana Priya

Ads

సోషల్ మీడియాలో పెట్టిన ఒకే ఒక్క వీడియో ద్వారా చాలా ఫేమస్ అయిన వారిలో బర్రెలక్క ఒకరు. బర్రెలక్క అసలు పేరు శిరీష. తాను డిగ్రీ వరకు చదువుకున్నా కూడా తనకి ఉద్యోగం రాలేదు అని, ఈ కారణంగా తాను బర్రెల వ్యాపారం చేస్తున్నాను అని ఒక వీడియో చేశారు. ఆ వీడియో తర్వాత చాలా ఫేమస్ అయిపోయారు. ఎంతోమంది ఇంటర్వ్యూలు తీసుకోవడం మొదలుపెట్టారు. వారందరికీ కూడా తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి చెప్పారు బర్రెలక్క. బర్రెలక్కకి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. మహేష్ బాబుని ఇప్పుడు సూపర్ స్టార్ అంటున్నారు. కానీ అంతకుముందు మహేష్ బాబుని ప్రిన్స్ అని పిలిచేవారు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ కారణంగానే బర్రెలక్క తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ యూజర్ నేమ్ ని ప్రిన్సెస్ సిరి అని పెట్టుకున్నారు.

Video Advertisement

ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూ సమయంలో తెలిపారు. అయితే తర్వాత ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ గెలవలేక పోయారు. అయినా కూడా బర్రెలక్కకి చాలా మంది అభిమానులు అయ్యారు. అయితే ఇటీవల బర్రెలక్క పెళ్లి జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగాక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. తనకి కాబోయే భర్త పేరు వెంకటేష్ అని చెప్పారు.

barrelakka husband educational qualification

వీరి పెళ్లి వారి ఊరిలోనే జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. పెళ్ళికి ముందు వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ మధ్యలో కరెంట్ పోయింది. అదే సమయంలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు కూడా తీస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి కరెంట్ పోయింది. ఈ వీడియోని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో పెళ్లి చేసుకుంటున్నప్పుడు కూడా ఇలా జరగడం ఏంటి? ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పైన దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు. ఇది బర్రెలక్క పోరాట ఫలితం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

watch video:


End of Article

You may also like