Ads
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం .. దీని గురించి పెద్దగా తెలియని వాళ్లకు కూడా బర్రెలక్క కారణంగా బాగా తెలిసే ఉంటుంది. ఇంతకీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క.. భవిష్యత్తు ఏమిటి అనే విషయంపై ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయో తెలుసా? బర్రెలక్క గెలుపు ఓటముల పై బేరీజు వేస్తూ జరిగిన ఆరా మస్తాన్ సర్వే వివరాలను వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం బర్రెలక్కకు 15 వేల ఓట్లు రావచ్చని సర్వే పేర్కొంది.
Video Advertisement
ఈ డేటా ప్రకారం బర్రెలక్క గెలుస్తుందా లేదా అనేదానికంటే కూడా గట్టి పోటీని ఇస్తుంది అని మాత్రం కచ్చితంగా తెలుస్తుంది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇక బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష..పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకుంది.మర్రికల్ గ్రామంలోని బూత్ నెంబర్ 12 లో బర్రెలక్క ఓటు వేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆమెకు ఈసీ సెక్యూరిటీ కూడా ఇచ్చారు.
సెక్యూరిటీతో పోలింగ్ బూత్ వద్దకు వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత..బర్రెలక్క మీడియాతో మాట్లాడింది. ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకొని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చింది. సర్వే విషయం పక్కన పెడితే బర్రెలక్క మాత్రం తన గెలుపు పై కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఫలితాలు ఎవరి పక్కన ఉంటాయో రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది..
తెలంగాణ అసెంబ్లీ ఎలెక్షన్ల పై సుమారు 20 దాకా సర్వే సంస్థలు వారు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేశారు. అయితే వాటిలో పదిహేనుకు పైగా సర్వేలు ఈ అసెంబ్లీ ఎలెక్షన్స్ లో కాంగ్రెస్ ముందుంజలో ఉన్నట్టుగా వెల్లడించాయి. కొన్ని సంస్థలు మాత్రమే అధికార పార్టీ బీఆర్‌ఎస్‌దే విజయం అని తెలిపాయి. ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కాంగ్రెస్ కంటే బీఆర్‌ఎస్ వెనుకబడిందని వెల్లడించడంతో తుది ఫలితాల్లో కూడా ఇదే నిజమయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ పండితులు సైతం అభిప్రాయడుతున్నారు.
End of Article