బర్రెలక్కకి కాబోయే భర్త ఏం చదువుకున్నారో తెలుసా..? ఆయన స్వస్థలం ఏదంటే..?

బర్రెలక్కకి కాబోయే భర్త ఏం చదువుకున్నారో తెలుసా..? ఆయన స్వస్థలం ఏదంటే..?

by Mohana Priya

Ads

సోషల్ మీడియా ద్వారా బర్రెలక్క అనే పేరుతో ఫేమస్ అయ్యారు శిరీష. నిరుద్యోగం గురించి చేసిన ఒకే ఒక్క వీడియోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో పాల్గొన్నారు. కానీ గెలవలేదు. ఎంతో మంది అభిమానులని బర్రెలక్క సంపాదించుకున్నారు. డిగ్రీ చదివినా కూడా ఉద్యోగాలు రావట్లేదు అంటూ ఒక వీడియో చేశారు. దాంతో ఫేమస్ అయిపోయారు. బర్రెలక్క అసలు పేరు కర్నె శీరిష. శిరీష తెలంగాణలో పెద్ద కొత్తపల్లి మండలంలోని మరికల్ గ్రామానికి చెందినవారు. బర్రెలక్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

Video Advertisement

barrelakka husband educational qualification

తన పెళ్లి జరుగుతున్నట్టు ఇటీవల ప్రకటించారు. సడన్ గా నిశ్చితార్థం జరిగిన కారణంగా ఎవరిని పిలవలేకపోయారు అని చెప్పారు. మేకప్ వీడియో కూడా షేర్ చేశారు. అలాగే తనకి కాబోయే భర్తతో ఫోటోషూట్ కూడా చేశారు. ఆ పాటని కూడా షేర్ చేశారు. బర్రెలక్క అభిమానులు అందరూ కూడా ఆమెకి అభినందనలు తెలుపుతున్నారు. బర్రెలక్క తన భర్తకి సంబంధించిన వివరాలు పెద్దగా బయటికి చెప్పకపోవడంతో, ఆ వ్యక్తి ఎవరు అని ఆసక్తి నెలకొంది. బర్రెలక్క పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి పేరు వెంకటేష్. ఈ విషయాన్ని బర్రెలక్క సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వెంకటేష్ కూడా నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న పెద్ద కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. వెంకటేష్ ఎంఎస్సీ ఫిజిక్స్ చేశారు.

మెల్లగా తనకి సంబంధించిన వివరాలని బర్రెలక్క సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. బర్రెలక్క సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటారు. మార్చి 28వ తేదీన వీరి పెళ్లి జరుగుతుంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు, షాపింగ్ ఇప్పటికే పూర్తి అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బర్రెలక్క తన పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. అయినా కూడా సోషల్ మీడియాలో ఉన్నవారికి తన జీవితానికి సంబంధించిన విషయాలని చెప్తూ ఉన్నారు. ఎంగేజ్మెంట్ కి సంబంధించిన విషయాన్ని షేర్ చేసి, పిలవనందుకు సారీ అని చెప్పారు. తన ఫాలోవర్స్ కి బర్రెలక్క ఎంత విలువ ఇస్తారు అనే విషయం ఇది చూస్తే తెలుస్తోంది. అందుకే అంత మంది అభిమానులను సంపాదించుకున్న బర్రెలక్కకి, ఆమె మంచి కోరుకుంటూ ఫాలోవర్స్ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ALSO READ : మనవడి పుట్టినరోజున…నారా చంద్రబాబు నాయుడు కుటుంబం టీటీడీ కి ఎంత విరాళం ఇచ్చారో తెలుసా?


End of Article

You may also like