BARRELAKKA SIRISHA: సడన్ గా పెళ్లి గురించి అనౌన్స్ చేసిన “బర్రెలక్క”… వరుడు ఎవరా అని వెతికేస్తున్న నెటిజెన్స్.

BARRELAKKA SIRISHA: సడన్ గా పెళ్లి గురించి అనౌన్స్ చేసిన “బర్రెలక్క”… వరుడు ఎవరా అని వెతికేస్తున్న నెటిజెన్స్.

by Mohana Priya

Ads

బర్రెలక్క. గత కొంత కాలం నుండి ఎక్కడ చూసినా వినిపించిన పేరు ఇది. డిగ్రీ చదువుకున్నా కూడా తనకి ఉద్యోగం రాలేదు అని, దాంతో బర్రెల వ్యాపారం చేస్తున్నాను అని ఒక వీడియో ద్వారా ఫేమస్ అయ్యారు. అప్పుడు చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆమె పేరు శిరీష. బర్రెలక్క పేరుతో చాలా పాపులర్ అయ్యారు. ఈ పాపులారిటీతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కానీ ఓట్లు ఎక్కువగా రాకపోవడం వల్ల గెలవలేకపోయారు. సోషల్ మీడియాలో బర్రెలక్క చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎన్నో విషయాలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటారు.

Video Advertisement

barrelakka marriage announcement

అయితే, ఇప్పుడు బర్రెలక్క సోషల్ మీడియా ద్వారా ఇంకొక విషయాన్ని ప్రకటించారు. తనకి నిశ్చితార్థం అయినట్టు చెప్పారు. నిశ్చితార్థానికి సంబంధించిన మేకప్ వీడియో, నిశ్చితార్థం వేడుకలో జరుగుతున్న ఒక వీడియో కూడా తీసి షేర్ చేశారు. “మా సైడ్ అబ్బాయి మేనత్త పాపిట్లో బొట్టు పెడుతుంది. చాలా మంది అడిగారు కదా. ఒకసారి మీరే చూడండి” అంటూ ఒక వీడియో షేర్ చేశారు. కానీ బర్రెలక్కకి కాబోయే భర్త ఎవరో మాత్రం ఇంకా చూపించలేదు. “ఎంగేజ్మెంట్ కి మేకప్ వేసుకున్నా. ఎలా ఉందో చెప్పండి” అంటూ మరొక వీడియో కూడా షేర్ చేశారు. ఈ వీడియోలో, “అందరికీ సారీ. ఎంగేజ్మెంట్ సడన్ గా పెట్టుకోవడం వల్ల ఎవరిని ఇన్వైట్ చేయలేకపోయాను” అని చెప్పారు. అయితే బర్రెలక్కకి గతంలోనే మరొక పెళ్లి జరిగినట్టు సమాచారం. కొన్ని కారణాల వల్ల వారు విడిపోయారు.

గతంలో బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తో, బర్రెలెక్క పెళ్లి జరుగుతుంది అనే ఒక వార్త వచ్చింది. అందుకు కూడా తను స్పందించి అవి కేవలం పుకార్లు మాత్రమే అని చెప్పారు. ఇప్పుడు తన నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటించారు. బర్రెలక్క అలియాస్ శిరీష సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. నిరుద్యోగం ద్వారా చేసిన ఒకే రీల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిపోయారు. ఎన్నో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా ద్వారా ఎన్నో ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అని బర్రెలక్క ప్రకటించిన తర్వాత చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఆమెకి అభినందనలు తెలిపారు.

ALSO READ : అసలు ఏంటి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్? కేజ్రీవాల్ ని ఎందుకు అరెస్ట్ చేసారు? పూర్తి వివరాలు!


End of Article

You may also like