Ads
బర్రెలక్క అలియాస్ శిరీష. గత మూడు-నాలుగు నెలల నుండి ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయారు. ఇటీవల బర్రెలక్క పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. నాగర్ కర్నూలు జిల్లాకి చెందిన వెంకటేష్ తో బర్రెలక్క పెళ్లి జరిగింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే బర్రెలక్క, తన నిశ్చితార్థ విషయాన్ని ప్రకటించారు. సడన్ గా ఎంగేజ్మెంట్ అవ్వడంతో ఎవరిని పిలవలేకపోయాను అని చెప్పి, సారీ అని చెప్పారు. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో ఎన్నో వీడియో షేర్ చేశారు. తన భర్తకి కూడా రాజకీయాలు అంటే ఆసక్తి ఉంది అని, పెళ్లయ్యాక రాజకీయాల్లోనే ఉంటాను అని బర్రెలక్క తెలిపారు.
Video Advertisement
అయితే, ఇటీవల యూట్యూబ్ లో ఒక వీడియో షేర్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు నిన్న ఉగాది పండుగ జరుపుకున్నాయి. భారతదేశం అంతటా కూడా ఉగాది పండుగని వివిధ పేర్లతో జరుపుకుంటారు. అయితే బర్రెలక్క ఉగాది పండుగకి తన తల్లిని మిస్ అవుతున్నట్టు ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో బర్రెలక్క తల్లి మాట్లాడారు. “ప్రతి సంవత్సరం నలుగురం కలిసి పండగ చేసుకుంటా. కానీ ఈసారి ముగ్గురమే చేసుకుంటున్నాం అంటే మనసు చాలా బాధగా ఉంది” అంటూ మాట్లాడారు. ఈ వీడియోని బర్రెలక్క క్రియేషన్స్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేశారు.
ఇది చూసిన వారందరూ కూడా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఆడపిల్లలు అన్న తర్వాత వేరే ఇంటికి వెళ్లక తప్పదు. అలా వెళ్లాక తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అలా మిస్ అయినప్పుడు ఇలాగే అనిపిస్తుంది. బర్రెలక్క తల్లికి కూడా ఇలాగే అనిపించింది అంటూ ఎమోషనల్ అయ్యారు. “మీరు కూడా ఉగాది పండుగని మంచిగా జరుపుకోండి. స్వీట్ చేసుకోండి. మా పాప వంతుని అలాగే పెట్టాం. గొడవ పెట్టేసుకుంటుంది. బర్రెలక్కతో మామూలుగా ఉండదు. అవసరమైతే వాళ్ల ఇంటికి వెళ్లి తినిపించేసి వస్తాను. నా దగ్గరికి ఎందుకు రాలేదు అని బాధపడుతుంది. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్లి తినిపించి వస్తాను” అంటూ బర్రెలక్క తల్లి మాట్లాడారు.
watch video :
ALSO READ : 2018 లో ఈ మాట చెప్పాడు… 6 సంవత్సరాల తర్వాత నిజం చేశాడు..! ఎవరు ఈ ప్లేయర్..?
End of Article