చెప్పిన మాట నిలబెట్టుకున్న “బర్రెలక్క”… ఎంపీ గా నామినేషన్.! ఆ బలమైన నాయకుడిపై గెలిచేనా.?

చెప్పిన మాట నిలబెట్టుకున్న “బర్రెలక్క”… ఎంపీ గా నామినేషన్.! ఆ బలమైన నాయకుడిపై గెలిచేనా.?

by Mohana Priya

Ads

ఒకే ఒక్క వీడియో ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు బర్రెలక్క అలియాస్ శిరీష. డిగ్రీ చదివినా కూడా ఉద్యోగాలు రాకపోవడంతో, బర్రెల వ్యాపారం చేసుకుంటున్నాను అని ఒక వీడియో చేశారు. దాంతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆ పాపులారిటీ సంపాదించిన తర్వాత, రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు. కానీ గెలవలేకపోయారు. అయినా కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను అని చెప్పారు. ఇటీవల బర్రెలక్కకి వెంకటేష్ అనే వ్యక్తితో పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాజకీయాల్లో పాల్గొంటారా? లేదా? అనే అనుమానం వ్యక్తం అయ్యింది.

Video Advertisement

barrelakka nomination as mp

ఇందుకు సమాధానం చెప్తూ, తన భర్తకి కూడా రాజకీయాలు అంటే ఇష్టం అని, పెళ్లయ్యాక కూడా ఇద్దరు కలిసి రాజకీయాల్లో పోటీ చేస్తారు అని చెప్పారు. ఇప్పుడు చెప్పినట్టుగానే లోక్ సభ ఎన్నికల నామినేషన్స్ లో పాల్గొన్నారు. మంగళవారం నాడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుండి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క తన నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలు సమర్పించడానికి వచ్చినప్పుడు, బర్రెలక్కతో పాటు, తన భర్త, మిగిలిన కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు, స్నేహితులు ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. దాంతో బర్రెలక్క మాట నిలబెట్టుకున్నారు అంటూ అందరూ అభినందిస్తున్నారు.

barrelakka

ఈ స్థానం నుండి బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎన్నికల్లో నిలబడుతున్నారు. గతంలో ప్రవీణ్ కుమార్ బర్రెలక్కకి మద్దతు ఇవ్వడం మాత్రమే కాకుండా, బీఎస్పీలోకి రావాలి అని ఆహ్వానం అందించినట్టు వార్త ప్రచారంలో ఉంది. మరి ఈసారి ఇద్దరూ ప్రత్యర్థులుగా నిలబడుతున్నారు. గతంలో బర్రెలక్క ఓడిపోయినా కూడా ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారు. తన ధైర్యాన్ని కోల్పోలేదు. మళ్లీ నామినేషన్ వేశారు. ఈసారి తన భర్తతో కలిసి రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు. తన భర్తకి కూడా రాజకీయాలు అంటే ఇష్టం అని చెప్పారు. మరి ఈసారి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి, ఈసారి బర్రెలక్క గెలుస్తారా అనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.

watch video :

ALSO READ : RCB తో మ్యాచ్ లో 300 స్కోర్ చేయడానికి కమిన్స్ పెద్ద ప్లాన్…మార్క్రమ్ స్థానంలో ఎవరిని అంటే.?


End of Article

You may also like