భర్తకి తెలియకుండా వీడియో తీసి పోస్ట్ చేసిన బర్రెలక్క..! అందులో ఏం ఉందంటే..?

భర్తకి తెలియకుండా వీడియో తీసి పోస్ట్ చేసిన బర్రెలక్క..! అందులో ఏం ఉందంటే..?

by Mohana Priya

Ads

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారిలో బర్రెలక్క అలియాస్ శిరీష కూడా ఒకరు. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇటీవల బర్రెలక్క పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. నాగర్ కర్నూల్ గ్రామానికి చెందిన వెంకటేష్ తో బర్రెలక్క పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఎంగేజ్మెంట్ విషయాన్ని, ఆ తర్వాత పెళ్లి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. పెళ్లికి ముందు ఒక సాంగ్ ఫోటోషూట్ వీడియో కూడా షేర్ చేశారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని బర్రెలక్క షేర్ చేస్తూ ఉన్నారు.

Video Advertisement

barrelakka video about husband

అలా ఇటీవల ఒక వీడియో షేర్ చేశారు. తన భర్తకి తెలియకుండా వీడియో తీసి షేర్ చేశారు. ఈ వీడియోకి, “నా హస్బెండ్ కి తెలియదు వీడియో తీస్తున్నా అని. గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్” అంటూ క్యాప్షన్ పెట్టి షేర్ చేశారు. ఇంకా చాలా వీడియోలని బర్రెలక్క తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. మరొక వీడియోలో తన భర్తతో కలిసి స్కూటీ మీద వెళుతున్న వీడియో షేర్ చేశారు. ఈ వీడియోకి క్యాప్షన్ గా, “బెస్ట్ ఫ్రెండ్ ప్లస్ హస్బెండ్. చాలా లక్కీ బంగారం నేను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్” అని పెట్టారు.

తన పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ థాంక్స్ చెప్తూ ఒక వీడియో కూడా బర్రెలక్క షేర్ చేశారు. తనని ఫాలో అయ్యే వారికి బర్రెలక్క ఎంత గౌరవం ఇస్తారు అనేది ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. గతంలో కూడా ఎంగేజ్మెంట్ కి పిలవనందుకు సారీ చెప్పారు. పెళ్లికి కూడా అందరూ రావాలి అని అన్నారు. అలా ఫాలోవర్స్ ని కూడా బర్రెలక్క తన సొంత కుటుంబం లాగానే చూసుకుంటారు. అందుకే తన వ్యక్తిగత విషయాలని కూడా తన ఫాలోవర్స్ కి షేర్ చేస్తూ ఉంటారు. ఫాలోవర్స్ కూడా బర్రెలక్కకి అభినందనలు తెలుపుతూ ఉంటారు.

watch video :

ALSO READ : అసలు పాడినవారికంటే…కోరస్ పాడిన అమ్మాయికి ఫిదా అంటూ కామెంట్స్.! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.?


End of Article

You may also like