బర్రెలక్క ఘోర పరాజయం..! ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?

బర్రెలక్క ఘోర పరాజయం..! ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?

by Harika

Ads

ఒకే ఒక వీడియో ద్వారా సోషల్ మీడియా అంతటా పాపులర్ అయ్యారు బర్రెలక్క. డిగ్రీ చదివాక తనకి ఉద్యోగం రాకపోవడంతో బర్రెల వ్యాపారం చేస్తున్నాను అని ఒక వీడియో చేశారు. ఆ తర్వాత ఫేమస్ అయ్యారు. రాజకీయాల్లో కూడా నిలబడ్డారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు బర్రెలక్క. ఆమె అసలు పేరు శిరీష. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో శిరీష షేర్ చేస్తూ ఉంటారు. అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు బర్రెలక్క. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో రాలేదు. మొత్తంగా కేవలం 3087 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు బర్రెలక్కకి ఎమ్మెల్యే అభ్యర్థిగా 5754 ఓట్లు వచ్చాయి.

Video Advertisement

barrelakka

దాంతో ఈసారి కూడా ఎక్కువ ఓట్లు వస్తాయి అని అందరూ ఆశించారు. నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థి మల్లు రవి అక్కడ గెలుపొందారు. నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిన పోటీలో మల్లు రవి 94,414 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సోషల్ మీడియాలో బర్రెలక్కకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిరుద్యోగ యువత వైపు నుండి పోరాడాలి అని రాజకీయాల్లోకి దిగారు. వారందరికీ తాను న్యాయం చేస్తాను అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క గెలవలేదు. అయినా కూడా తన ధైర్యాన్ని కోల్పోకుండా లోక్‌సభ ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు.

బర్రెలక్క ధైర్యానికి ఎంతో మంది ప్రశంసించారు. ఇప్పుడు కూడా ఆమె ధైర్యాన్ని ఎంతో మంది పొగుడుతున్నారు. సాధారణంగా ఆడవారు రాజకీయాల్లోకి రావాలి అంటే ఆలోచిస్తారు. కానీ బర్రెలక్క మాత్రం ఒకసారి ఓడిపోయినా కూడా లెక్క చేయకుండా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారు. దాంతో అంత ధైర్యం ఉండడం చాలా ముఖ్యమైన విషయం అని, ఇందుకు బర్రెలక్కని మెచ్చుకోవాలి అని అందరూ అంటున్నారు. సోషల్ మీడియాలో అందరూ బర్రెలక్కకి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like