సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లు పెళ్లి తప్పించుకోవడాని తనకు నచ్చిన హీరోతో లేచిపోవడానికి వాడే ట్రిక్ ఇది ..ఇలాంటి సీన్ లు మనం సినిమాల్లో ఇప్పటికే చాలానే చూసాం ..చీరలను తాడులా  కట్టి ఇంటి కిటికీ లేదా బాల్కనీలో కట్టి కిందకి జారీ పారిపోయే సీన్ ..అయితే సరిగ్గా ఇదే టెక్నీక్ వాడి కరోనా పేషెంట్ ఉపయోగించుకొని ఆసుపత్రి నుండి పరారయ్యాడు ..ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపుతోంది ..

Video Advertisement

గత నెలలో ఢిల్లీ జమాత్ సభలకు హాజరైన నేపాల్ కు చెందిన 60 ఏళ్ళ వృద్ధుడు కరోనా వ్యాధి బారినపడ్డాడు ..కాగా అతనికి యూపి లోని బాగ్ పద్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు ..కాగా ఆ వృద్ధుడు హాస్పిటల్ లో బేడీషీట్ ను మరియు అతని దుస్తులను కలిపి తాడులా తయారుచేసి విండో కి వున్నా అద్దం పగలకొట్టి ఆ తాడు సహాయంతో కిందకి జారీ తప్పించుకున్నాడని ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫిసర్ ఆర్కే టాండన్ వెల్లడించారు . కాగా అతడిని 17 మంది నేపాలీలతో సహా అతనిని శుక్రవారం పోలీసులు ఆసుపత్రిలో జాయిన్ చేసారని అయన చెప్పారు ..కాగా ఆ వృద్దుడికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో ఐసొలేషన్ వార్డ్ కు తరలించి చికిత్స అందిస్తామని అయినా అయన ఎన్నిరోజులలో ఎప్పుడు తేడాగా ప్రవర్తించలేదని సక్రమంగానే ఉండేవాడిని ఆర్కే తెలిపారు ..

source: ANI news

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇలా ఆసుపత్రి నుండి పరారు అవ్వడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ..అతడు ఇప్పుడు హాస్పిటల్ నుండి వెళ్ళాడు కానీ ఇప్పుడు అతను సాధారణ జనాలతో కలిసి తిరగటం వలన మిగతా జనాలకి కరోనా సోకి తద్వారా ఈ వ్యాధి మరింత విస్తరిస్తుందని అప్రమత్తం అయినా పోలీస్ లు వెంటనే రంగంలోకి దిగారు ..కాగా ఇప్పటికే సదరు వ్యక్తిపై యాప్ఐఆర్ నమోదు చేసి …

source: ANI news UP

చుట్టుపక్కల ప్రాంతాలలో అతను ఎక్కడ ఉన్నాడో తెలుసుకొనే ప్రయత్నంలో వివిధ బృందాలను పంపినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు ..దింతో అధికారుల వెతుకులాట ఫలించింది.అతడిని తిరిగి పట్టుకొని మళ్ళి తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స ఇస్తూ భద్రతా మరింత కట్టుదిట్టం చేసారు . హాస్పిటల్ కి మూడు కిలోమీటర్ల దూరంలో అతనిని పట్టుకున్నారు పోలీసులు. కాగా కిటికీలు ఏమి లేని రూమ్ కి తరలించి మళ్ళి తప్పించుకోవడానికి వీలు లేకుండా చేసి చికిత్స అందిస్తున్నారు ..కాగా అతను అన్ని రోజులలో ఎవరిని కలిసారో ఎక్కడో తిరిగారో తెలుసుకొని వారికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహించే పనిలో పోలీస్ లు ఉన్నట్లు  మెడికల్ చీఫ్ ఆఫీసర్ ఆర్కే తెలిపారు .