క్రికెట్ బోర్డ్స్ లోనే అత్యంత రిచ్ అయిన బీసీసీఐ 10 నెలల నుండి ఆటగాళ్లకు డబ్బులు చెల్లించలేదు అంట.?

క్రికెట్ బోర్డ్స్ లోనే అత్యంత రిచ్ అయిన బీసీసీఐ 10 నెలల నుండి ఆటగాళ్లకు డబ్బులు చెల్లించలేదు అంట.?

by Mohana Priya

Ads

బిసిసిఐ ప్రపంచంలోనే అత్యంత ధనికులైన క్రికెటర్లకు పది నెలల నుండి వాళ్లకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించలేదు. బిసిసిఐ ఎలైట్ కాంట్రాక్ట్ లో ఉన్న 27 మంది ప్లేయర్లు గత సంవత్సరం అక్టోబర్ నుండి ఉన్న ఇన్స్టాల్మెంట్ ని పొందాల్సి ఉంది. 2019 డిసెంబర్ నుండి జాతీయ జట్టు ఆడిన రెండు టెస్టులు, తొమ్మిది వన్డేలు మరియు ఎనిమిది టి 20 ఆటలకు మ్యాచ్ ఫీజులను కూడా బోర్డ్ ఇంకా ప్లేయర్లకు చెల్లించలేదు.

Video Advertisement

కాంట్రాక్ట్ లో ఉన్న క్రికెటర్లకు సంవత్సరానికి చెల్లించాల్సిన మొత్తం 99 కోట్లను గ్రేడింగ్ ఆధారంగా విభజించారు. గ్రేడ్ ఎ + క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాకు ఏటా రూ .7 కోట్లు, ఎ, బి, సి గ్రేడ్‌లలోని ప్లేయర్లకు 5 కోట్లు, రూ .3 కోట్లు, రూ .1 కోటి రూపాయలను  చెల్లించాలని నిర్ణయించుకున్నారు.

సాధారణం గా క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్ కి 15 లక్షలు, వన్డే కి ఆరు లక్షలు, టి 20 కి మూడు లక్షల ఫీజు తీసుకుంటారు. 2018 మార్చి లో బిసిసిఐ విడుదల చేసిన చివరి బ్యాలెన్స్ షీట్ ప్రకారం, ఫిక్స్డ్ డిపోసిట్ 2992 కోట్లతో కలిపి బ్యాంక్ బ్యాలెన్స్ 5526 కోట్లు ఉందట. ఏప్రిల్ 2018 లో బిసిసిఐ స్టార్ టీవీతో 6138.1 కోట్ల కాంట్రాక్ట్ కుదుర్చుకుంది.

కాంట్రాక్ట్ లో ఉన్న 8 క్రికెటర్లు వాళ్లకు రావాల్సిన మొత్తాన్ని ఇంకా చెల్లించలేదు అని, అసలు కారణమేంటో కనుక్కుందామని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమల్ తో ఎన్ని సార్లు మాట్లాడాలని ప్రయత్నించినా కూడా స్పందించలేదు అని చెప్పారు. ఫస్ట్ క్లాస్, ఇంకా ఏజ్ గ్రూప్ ప్లేయర్లకు కూడా వాళ్లకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించడానికి చాలా ఆలస్యమైందట.

కాన్స్టిట్యూషన్ ప్రకారం బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఇంకా సెక్రెటరీ జై షా పదవి కాలం అయిపోయిందట. మళ్లీ వాళ్లని తిరిగి తీసుకురావడానికి కూలింగ్ ఆఫ్ క్లాజ్ ని రద్దు చేయాలి అని బోర్డు మెంబర్లు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారట. మామూలుగా ఈ కాంట్రాక్ట్ అనేది అక్టోబర్ లో  ప్రారంభం అవుతుంది కానీ ఈసారి ఆటగాళ్ల జాబితాను జనవరిలోనే ప్రకటించారు.

అంతేకాకుండా జార్ఖండ్, ముంబై, బెంగాల్, జమ్మూ అండ్ కాశ్మీర్, పాండిచ్చేరి, బరోడా రైల్వేస్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ కి చెందిన దేశీయ క్రికెటర్లు కూడా తమకి గత సీజన్ కి సంబంధించిన మొత్తం విషయంలో ఫుల్ సెటిల్మెంట్ కాలేదు అని తెలిపారు. బిసిసిఐ వెబ్సైట్ ప్రకారం అన్ని రాష్ట్ర యూనిట్లకు క్రికెట్ ఆక్టివిటీస్ కి సంబంధించిన అన్యువల్ సబ్సిడీ మొత్తం 10 కోట్లు క్రెడిట్ అయ్యాయి అని ఉంది.


End of Article

You may also like