“బీస్ట్” ఫస్ట్ రివ్యూ..! సినిమాకి హైలైట్ ఇవేనంట..!

“బీస్ట్” ఫస్ట్ రివ్యూ..! సినిమాకి హైలైట్ ఇవేనంట..!

by Mohana Priya

Ads

మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి.

Video Advertisement

తమిళ్ హీరోలు అయిన సూర్య, విక్రమ్, అజిత్, విజయ్, కార్తీ, విశాల్ వీళ్ళందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు అదే విధంగా తలపతి విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా తెలుగులో విడుదల అవుతోంది. తమిళంలో రూపొందించిన ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా సౌత్ ఇండియన్ భాషలైన కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో కూడా విడుదల అవుతోంది.

thalapathy vijay arabic kuthu step similar to a famous allu arjun step

ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్‌హిట్ అయ్యాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమా ట్రైలర్ చూస్తే ఒక మాల్ హైజాక్ చేస్తారు అని, అందులో చిక్కుకుపోయిన వాళ్ళని హీరో కాపాడతాడు అని మనకి అర్థమవుతుంది. సినిమాలో నటించిన వాళ్ళందరూ కూడా దాదాపు ఒకటే కాస్ట్యూమ్ తో కనిపిస్తారు. అలాగే సినిమాలో మధ్యలో కూడా పాటలు ఉండవట.

beast movie overseas censor board review by umair sandhu

ఈ సినిమాకి ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఓవర్సీస్ సెన్సార్ రివ్యూ ఇచ్చారు. ఇందులో ఉమైర్ సంధు ఈ విధంగా రాశారు. “ఇది చాలా బాగా తీసిన ఒక ట్రైలర్. విజయ్ పాత్ర ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఎక్కడ కూడా ఎక్కువ అయినట్లుగా లేదు. విజయ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మొత్తంగా చెప్పాలంటే బీస్ట్ సినిమా ఒక ఎంగేజ్ ఇన్ స్క్రీన్ ప్లే తో తీసిన మంచి యాక్షన్ థ్రిల్లర్. చివరి వరకు కూడా ఏమవుతుంది అనే ఆసక్తితో చూస్తారు. సినిమాని కచ్చితంగా చూడండి” అని రాశారు. అంతే కాకుండా సినిమాకి ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు.


End of Article

You may also like