Ads
ఇటీవల ముంబైలో జరిగిన ఒక సంఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం 19 సంవత్సరాల వయసు గల షైజాన్ ఆగ్వాన్ అనే ఒక వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఒక టీనేజ్ అమ్మాయిని కలిశాడు. ఆ అమ్మాయి ఒక చార్టెడ్ అకౌంటెంట్ కూతురు. వారిద్దరూ సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయ్యారు.
Video Advertisement
ఒకసారి ఆ అమ్మాయి ఇంకా తన కుటుంబ సభ్యులు తమ ఇంట్లో లేని సమయంలో షైజాన్ ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి వాళ్ల లాకర్ లో ఉన్న బంగారు ఆభరణాలని, 14 లక్షల విలువచేసే వస్తువులను అలాగే కొంత డబ్బుని, ఒక ఐ ఫోన్ ని దొంగిలించాడు. ఇదంతా ఆ అమ్మాయి అంతకుముందు షైజాన్ దగ్గర వదిలేసిన వాళ్ళ ఇంటి డూప్లికేట్ తాళం చెవి సహాయంతో చేశాడు.
జనవరి 27వ తేదీన వెకేషన్ నుండి వచ్చిన తర్వాత ఆ కుటుంబం దొంగతనం జరిగిందని తెలుసుకుని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడంతో అమ్మాయి జరిగిన విషయం మొత్తం చెప్పి తను తన తాళంచెవి ని అతని దగ్గర వదిలేసింది అని కూడా చెప్పింది. దాంతో షైజాన్ ని మజగావ్ పరిధిలో అరెస్ట్ చేశారు.
End of Article