Ads
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు అయిన బెల్లంకొండ గణేష్ కొంత కాలం క్రితం సినిమాల్లోకి అడుగు పెట్టారు. ఇప్పుడు నేను స్టూడెంట్ సర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- చిత్రం : నేను స్టూడెంట్ సర్
- నటీనటులు : బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని, సముద్రఖని.
- నిర్మాత : నాంది సతీష్ వర్మ
- దర్శకత్వం : రాఖీ ఉప్పలపాటి
- సంగీతం : మహతి స్వర సాగర్
- విడుదల తేదీ : జూన్ 2, 2023
స్టోరీ :
సుబ్బారావు (బెల్లంకొండ గణేష్) 9 నెలలు కష్టపడి సంపాదించిన డబ్బులతో ఒక ఫోన్ కొనుక్కుంటాడు. ఆ ఫోన్ ని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాడు. సుబ్బారావు ఒక స్టూడెంట్. సరదాగా సాగిపోతున్న అతని జీవితంలో అనుకోని సంఘటన ఎదురవుతుంది. ఒక చేయని నేరంలో సుబ్బారావు ఇరుక్కుంటాడు.
సాక్షాధారాలు అన్నీ కూడా సుబ్బారావుకి వ్యతిరేకంగా ఉండడంతో ఎటువైపు నుండి కూడా సుబ్బారావుకి సహాయం దొరకదు. అసలు సుబ్బారావుని ఇబ్బంది పెట్టాలని చూసినవారు ఎవరు? ఇదంతా ఎందుకు చేశారు? సుబ్బారావు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వాటి నుండి ఎలా బయటపడ్డాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
యాక్షన్ సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇప్పుడు నేను స్టూడెంట్ సర్ సినిమాలో నటించారు. ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా చాలా కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు విడుదల అయ్యింది.
సినిమాకి దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. సినిమా మొదలవడం మామూలుగా మొదలైనా కూడా ముందుకు వెళ్లే కొద్దీ సస్పెన్స్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఒక పాయింట్ తర్వాత సినిమా కథ ప్రేక్షకులకి అర్థం అయిపోతూ ఉంటుంది. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుబ్బారావు పాత్రలో బెల్లంకొండ గణేష్ బానే నటించారు.
కానీ ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఇంకా కొంచెం బాగా నటిస్తే తెరపై ఆ ఎమోషన్స్ కనిపించేవి. మిగిలిన నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. సముద్రఖని, సునీల్ వీరిని అలాంటి పాత్రల్లో మనం అంతకుముందు చూసాం. కాబట్టి పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. పాటలు ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయి. సినిమాకి ప్రధాన బలం డైలాగ్స్. రైటర్ కళ్యాణ్ చక్రవర్తి రాసిన డైలాగ్స్ పవర్ ఫుల్ గా అనిపిస్తాయి.
నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా స్టోరీ పాయింట్ బాగున్నా కూడా తెరపై చూపించడంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు హీరో పాత్రని పరిచయం చేయడం, అతని ప్రేమకథ అలా నడుస్తుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉన్నా కూడా స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఇంకా బాగుండేది అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నిర్మాణ విలువలు
- దర్శకుడు ఎంచుకున్న పాయింట్
మైనస్ పాయింట్స్:
- కనెక్ట్ అవ్వని ఎమోషన్స్
- సాగదీసినట్టు ఉండే స్క్రీన్ ప్లే
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, సరదాగా ఏదైనా ఒక సినిమా చూద్దాం అనుకునే వారికి, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూద్దాం అనుకునే వారికి నేను స్టూడెంట్ సర్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
End of Article