కివీ పండు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

కివీ పండు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

by Megha Varna

Ads

నిత్యం మ‌నం తినే వివిధ ర‌కాల ఆహార ప‌దార్థాల్లో ఉండే పోష‌కాలివి. వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఏయే పోష‌కాన్ని తీసుకుంటే ఎలాంటి ర‌కాల లాభాలు క‌లుగుతాయో దాదాపుగా అంద‌రికీ తెలిసే ఉంటుంది. అయితే పైన చెప్పిన పోష‌కాల‌న్నీ మ‌న‌కు ఏదో ఒక ఆహార ప‌దార్థం తిన‌డం వ‌ల్ల ల‌భించేవే. కానీ అవ‌న్నీ ఒకే ప‌దార్థంలో ల‌భిస్తే..? దానికి మించిన అద్భుత‌మైన పోష‌కాహారం ఇంకేముంటుంది. అదిగో, అలాంటి ప‌దార్థ‌మే కివీ. కివీ పండు. న్యూజిలాండ్‌లో ఎక్కువగా పండే కివీలు మ‌న ద‌గ్గ‌ర ఇప్పుడు విరివిగా ల‌భిస్తున్నాయి. కివీ..ఈ పండును వండర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు.దాదాపు 27 రకాల పండ్లలో లబించే పోషకాలు ఒక్క కివీ పండులో లభిస్తాయి అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.కివీ పండు చూడటానికి ముదురు గోధుమరంగు నూగుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చగుజ్జు కలిగి వుంటుంది.రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. కివిపండులో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి . ఇది అనేక ప్రాంతాలలో పండిస్తారు, అండాకారములో ఉంటుంది . సుమారు 5.8 పొడవు 2.0 సెం.మీ. వెడల్పు, 5.5 సెం.మీ. ఎత్తు కలిగి మెత్తగా ఉంటుంది . మంచి సువాసన కలిగి ఉంటుంది . దీనిని వ్యాపార పండుగా అనేక దేశాలలో పండిస్తున్నారు .

Video Advertisement

kiwi fruit uses in telugu

kiwi fruit uses in telugu

కివీ పండు ఆరోగ్య ప్రయోజనాలు

గుండె జ‌బ్బుల‌కు…
గుండెకు ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు ఉపకరిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కివీ పండ్లను ఇస్తే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు అది తోడ్పడుతుంది.
నేత్ర‌వ్యాధుల‌కు…
రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను ఇవి అధిక శాతం వరకు తగ్గిస్తాయి.
క్యాన్స‌ర్లు రావు…
శరీరంలో ఏర్పడే నైట్రేట్ ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని ఇవి తగ్గిస్తాయి. క్యాన్సర్‌కు దారి తీసే జన్యు మార్పులను నిరోధించే పదార్థం కివీలలో ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తెలిసింది. చర్మ, కాలేయ, ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది.
జీర్ణ స‌మ‌స్య‌ల‌కు…
రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండేలా చేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే కివీ పండు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో అధికంగా ఉన్నాయి. మానసిక వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.

మ‌ధుమేహానికి, అధిక బ‌రువుకు…
రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది. ఇది మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. వీటిని తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.
పురుషుల ఆరోగ్యానికి…
కివీ పండులో ఉండే జింక్ పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను పెంచుతుంది. చర్మం, వెంట్రుకలు, పళ్లు, గోళ్లు తదితరాల పెరుగుదలకు జింక్ దోహదం చేస్తుంది.
ఇన్‌ఫెక్ష‌న్లు, అనారోగ్యాలు దూరం…
రక్త సరఫరా మెరుగుపడుతుంది. శ్వాస, ఆస్తమా వంటి సమస్యలను తొలగిస్తుంది. పిల్లలకు కనీసం వారానికి ఒక సారి కివీ పండ్లను ఇస్తే దగ్గు, జలుబు వంటి అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచేలా చేయవచ్చు.

kiwi fruit uses in telugu

kiwi fruit uses in telugu

కంటిసంబంధిత
కివి పండులో దండిగా విటమిన్లు, ప్లావనాయిడ్స్, ఖనిజలవనాలు ఉన్నాయి. రోజుకు 2-3 పండ్లు తింటే కంటిసంబంధిత, వయసు పెరుగుదలతో వచ్చే మాక్యులార్ క్షీణత 36% వరకూ తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

కివీ పళ్ళలో అధికమైన పోషక విలువలున్నాయి.

కార్బోహైడ్రేట్లు 14.66 గ్రా, షుగర్సు 8.99 గ్రా, ఫైబర్ 3.0 గ్రా, ఫేట్ 0.52 గ్రా, ప్రొటీన్ 1.14 గ్రా, లుటీన్, క్సాన్థిన్ 122 మైక్రో గ్రా, ధయామిన్ 0.027 మిగ్రా, రైబోఫ్లోవిన్ 0.025 మిగ్రా, నియాసిన్ 0.341 గ్రా, విటమిన్ బి6 0.63 మిగ్రా, ఫోలేట్ 25 మైక్రో గ్రా, విటమిన్ సి 92.7 మిగ్రా, విటమిన్ ఇ 1.5 మిగ్రా, విటమిన్ కే 40.3 మైక్రో గ్రా, కేల్షియమ్ 34 మిగ్రా, ఐరన్ 0.31 మిగ్రా, మెగ్నిషియమ్ 17 మిగ్రా, ఫాస్పరస్ 34 మిగ్రా,పొటాషియం 312 మిగ్రా, సోడియం 3 మిగ్రా, జింక్ 0.14 మిగ్రా ఉన్నాయి


End of Article

You may also like