“చేతిలో మొక్కలు మొలిచాయేంట్రా..?”… వైరల్ అవుతున్న “ఒక్కడు” రీమేక్ సీన్..?

“చేతిలో మొక్కలు మొలిచాయేంట్రా..?”… వైరల్ అవుతున్న “ఒక్కడు” రీమేక్ సీన్..?

by Mohana Priya

Ads

ఒక భాషలో ఒక సినిమా తీస్తే, అది హిట్ అయితే, వేరే భాషల్లోకి కూడా ఆ సినిమాని తీసుకెళ్తారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి డబ్ చేయడం. ఇంకొకటి రీమేక్ చేయడం. రెండిట్లో ఏది చేసినా కూడా ఒరిజినల్ సినిమాని ప్రాపర్ గా కన్వే చేయకపోతే, రిజల్ట్ మారిపోతుంది. కొన్ని సినిమాలు మాత్రం ఒరిజినల్ కంటే రీమేక్ బాగుంది అనుకునేలా ఉంటాయి.

Video Advertisement

కొన్ని మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. ఒక వేళ మంచి ఫలితం వచ్చినా కూడా, ఒరిజినల్ సినిమా కంటే మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేస్తారు. అలా మన సినిమాలు కూడా కొన్ని వేరే భాషల్లోకి రీమేక్ అయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుని స్టార్ చేసిన సినిమా ఒక్కడు. ఈ సినిమా తర్వాత నుండి మహేష్ బాబు స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు.

ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమా వేరే భాషల్లో కూడా రీమేక్ అయ్యింది. తమిళ్ లో గిల్లీ పేరుతో రీమేక్ అయ్యింది. ఇందులో విజయ్ హీరోగా నటించారు. ఈ సినిమా విజయ్ కెరీర్ లో కూడా టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. కన్నడలో అజయ్ పేరుతో రీమేక్ అయ్యింది. ఇందులో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించారు. అలాగే హిందీలో తేవర్ పేరుతో రీమేక్ అయ్యింది. ఇందులో అర్జున్ కపూర్ హీరోగా నటించారు.

bengali okkadu remake fighting scene goes viral

వీటితో పాటు ఒడియా, సింహళ భాషల్లో కూడా రీమేక్ అయ్యింది. బెంగాలీలో జోర్ పేరుతో రీమేక్ అయ్యింది. ఇందులో జీత్ హీరోగా నటించారు. అయితే తెలుగులో మహేష్ బాబు ప్రకాష్ రాజ్ ని బెదిరించి, భూమికని తీసుకెళ్లే సీన్ ఉంటుంది. ఇందులో మహేష్ బాబు ప్రకాష్ రాజ్ ని కొడతారు. ఈ సీన్ తెలుగులో చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. కానీ బెంగాలీలో మాత్రం తెలుగులో ఉన్నంత ఇంపాక్ట్ రాలేదు. అంతేకాకుండా హీరోకి కోపం వచ్చినప్పుడు పిడికిలి బిగించినప్పుడు వాడిన స్పెషల్ ఎఫెక్ట్ కూడా చేతి మీద మొక్కలకి వేర్లు మొలిచినట్టు ఉంది. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

watch video :


End of Article

You may also like