Ads
గుంటూరులో ఇటీవల జరిగిన ఓ ఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే సమయం కథనం ప్రకారం గుంటూరు జిల్లా రెంటచింతల అయ్యప్ప ట్రేడర్స్ అనే పురుగుల మందు దుకాణాన్ని నిర్వహించే చింత రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి 11 నెలల క్రితం విజయవాడకు చెందిన గల్లా సదాశివరావు దగ్గర 3.5 లక్షల విలువచేసే బెంజ్ కార్ కొన్నారు.
Video Advertisement
రవీందర్ రెడ్డి తన స్వగ్రామమైన రెంటాల కి చెందిన రాము అనే వ్యక్తిని డ్రైవర్ గా నియమించుకున్నారు. 5 నెలల క్రితం రాము కార్ తీసుకొని తన బంధువుల వివాహానికి వెళ్ళాడు. అనంతరం ఆ కార్ని గుంటూరు సమీపంలోని స్నేహితుడు అపార్ట్మెంట్ లో పెట్టాడు. అక్కడ దాని తాళం పోయింది. దాంతో రవీంద్ర రెడ్డి కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు రాము.
ఆయన గుంటూరు విజయవాడలో షో రూమ్ లో నకిలీ తాళాలతో కోసం ఎంత ప్రయత్నించినా కూడా దొరకలేదు. దాంతో కార్ తగలబెడితే బీమా వస్తుంది అని రవీందర్ రెడ్డి కి స్నేహితులు సలహా ఇచ్చారు. దాంతో రవీందర్ రెడ్డి తన స్నేహితుడైన నాగరాజు డ్రైవర్ రాము తో కలిసి ఈ నెల 17వ తేదీన రెంటచింతల నుండి మరో కారులో గుంటూరు లోని ఆటో నగర్ కి వచ్చి లాగుడు బండి మాట్లాడుకున్నారు.
దాని సాయంతో ఆ కార్ని తక్కెళ్ళపాడు వద్ద ఉంచి మరుసటి రోజు అర్థరాత్రి తన గ్రామం నుండి వస్తూ పేరేచర్ల దగ్గర ఐదు లీటర్ల డబ్బా లో పెట్రోల్ తెచ్చుకొని కారు పై చల్లి నిప్పంటించారు. వేడికి ఆ డబ్బా కరిగిపోయింది దాంతో నాగరాజు ఆయన దగ్గర ఉన్న నీళ్ల సీసా అని కొంచెం వరకు కట్ చేసి డబ్బాలో ని పెట్రోల్ ని అందులో పోసి వాహనంపై చల్లాడు ఈ క్రమంలో ఆయనకి గాయాలు అయ్యాయి. మిగిలిన వారు నాగరాజుని గుంటూరులోని ఆస్పత్రిలో చేర్పించారు.
స్థానికుల సమాచారంతో సీఐ సురేష్ బాబు ఘటనా స్థలానికి వెళ్లి కారుని పరిశీలించారు అక్కడ కోసి ఉన్న నీళ్ల సీసా కనిపించింది. దాంతో ఆ దిశగా దర్యాప్తు చేసి ఇ కారు పై కావాలని పంపించినట్టు నిర్ధారించారు. బుధవారం ఎస్సై వినోద్ కుమార్ నిందితులని అరెస్టు చేశారు విచారణలో ఇన్సూరెన్స్ కోసం తామే నిప్పు అంటించి నట్టు నిందితులు పేర్కొన్నారు. దాంతో వివిధ సెక్షన్ల కింద నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
End of Article