SBI ఖాతాదారులకు హెచ్చరిక: అలాంటి మెసేజ్ లతో జాగ్రత్త…లేదంటే నష్టమే.!

SBI ఖాతాదారులకు హెచ్చరిక: అలాంటి మెసేజ్ లతో జాగ్రత్త…లేదంటే నష్టమే.!

by Mohana Priya

Ads

గత కొద్ది రోజుల నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకి అకౌంట్ బ్లాక్ అయినట్టు మెసేజెస్ వస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక హెచ్చరిక జారీ చేసింది. అందులో సైబర్ క్రైమ్ నుండి ప్రజలని దూరంగా ఉండమని, అలాగే సైబర్ క్రైమ్ ద్వారా మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది.

Video Advertisement

sbi

హ్యాక్ చేసేవాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేదా ఇతర బ్యాంకు ఎకౌంట్ యూసర్ ల అకౌంట్ డీటెయిల్స్ ఎప్పుడు ఎప్పుడు దొరుకుతాయి అని ఎదురుచూస్తూ ఉంటారు అని, అందుకే హ్యాకర్లు, బ్యాంక్ ఎకౌంట్ ఉపయోగించే వారి ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు అని చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఎస్బిఐ ఒక ట్వీట్ చేసింది.

https://youtu.be/KId2oaFd3Fs

అందులో డబ్బు కానీ లేదా ఇతర ఏదైనా గిఫ్ట్ వచ్చింది అని వచ్చే మెసేజ్ ని పట్టించుకోవద్దు అని చెప్పారు. అలాగే వాళ్ళు ఇచ్చే లింక్ మీద కూడా క్లిక్ చేయద్దు అని చెప్పారు. అలాగే వారి స్మార్ట్ ఫోన్స్ లో, కంప్యూటర్స్ లో బ్యాంక్ కి సంబంధించిన అప్లికేషన్స్, అంతే కాకుండా ఇలా సైబర్ క్రైమ్స్ కనిపెట్టే అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు.

https://youtu.be/KId2oaFd3Fs

అలాగే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే ముందు దానికి సంబంధించిన విషయాలను కూడా జాగ్రత్తగా చదవమని, ఎందుకంటే డబ్బుకు సంబంధించిన ఏ విషయం అయినా సరే జాగ్రత్తగా చూడాలి అని చెప్పారు. అంతే కాకుండా ఎక్కడైనా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కానీ, లేదా ప్రైవేట్ విషయాలు కానీ అంటే ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ లాంటివి అడిగితే ఇవ్వవద్దు అని చెప్పారు.


End of Article

You may also like