Home Filmy Adda భగవంత్ కేసరి కలెక్షన్స్ చూశారా…! నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే….

భగవంత్ కేసరి కలెక్షన్స్ చూశారా…! నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే….

by Sainath Gopi

 

నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా మొదటి షో నుండి హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాలయ్య స్క్రీన్స్ ప్రజెంట్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. శ్రీ లీల బాలయ్య కాంబోలో వచ్చిన సీన్స్ అయితే ఎమోషనల్ గా కంటతడి పెట్టించాయి. కాజల్ కూడా తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

మొదటి రోజు నుండి హౌస్ ఫుల్ బోర్డులతో ఈ సినిమా దూసుకుపోతుంది. దసరా విన్నర్ అంటూ మూవీ టీం ప్రమోషన్స్ ను పెంచేసింది.అయితే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటుంది. నాలుగు రోజులు కలెక్షన్స్ ఒకసారి గమనిస్తే…

bhagavanth kesari movie review

ఈ సినిమాకి రూ.60.01 కోట్ల బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.61 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.39.17 కోట్లు షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో రూ.21.83 కోట్లు షేర్ ను రాబట్టాలి. నైజాంలో ఈ చిత్రం రూ.11.17 కోట్లు, సీడెడ్ లో రూ.6.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.73 కోట్లు, ఈస్ట్ లో రూ.2.03 కోట్లు, వెస్ట్ లో రూ.1.85 కోట్లు, గుంటూరులో రూ.4.13 కోట్లు, కృష్ణాలో రూ.1.29 కోట్లు, నెల్లూరులో 1.64 కోట్లు.

bhagavanth kesari movie review

మొత్తంగా ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటే రూ.31.11కోట్లు కలెక్ట్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.2.46 కోట్లు, ఓవర్సీస్ లో రూ.5.60 కలెక్షన్స్ వచ్చాయి.ఈ చిత్రానికి పోటీగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో సినిమాలు ఉండటం వల్ల కలెక్షన్స్ తగ్గాయి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఎంత కలెక్షన్స్ సాధిస్తుందో వేచి చూడాలి.

Also Read:గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ మెహరీన్..! ఇలా అయిపోయిందేంటి..?

You may also like