BHARAT RICE IN HYDERABAD: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 29 రూపాయల కిలో భారత్ రైస్…హైదరాబాద్ లో ఎక్కడ కొనచ్చు అంటే.?

BHARAT RICE IN HYDERABAD: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 29 రూపాయల కిలో భారత్ రైస్…హైదరాబాద్ లో ఎక్కడ కొనచ్చు అంటే.?

by Harika

Ads

ప్రస్తుతం బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, దేశమంతా వరి ఉత్పత్తి బాగానే ఉన్నప్పటికీ బియ్యం ధరలు మాత్రం దిగిరావడం లేదు. రోజురోజుకీ రేటు పెరిగిపోతూ సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సమస్య మీద దృష్టిపెట్టిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కల్పించేందుకు భారత్ రైస్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పేద సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు భారత్ రైస్ పేరుతో బియ్యాన్ని తీసుకువచ్చింది.

Video Advertisement

ఈ బియ్యాన్ని 29 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఈ బియ్యం విక్రయాలను ఇప్పటికే ప్రారంభించారు. నేషనల్ అగ్రికల్చర్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేంద్రీయ బండార్ రిటైల్ కేంద్రాలు, నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తో పాటు మొబైల్ అవుట్ లెట్ లలో కూడా ఈ బియ్యం విక్రయిస్తున్నారు.

అయితే హైదరాబాదులో ఈ బియ్యం కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం.

#1. సుల్తాన్ బజార్లో ఎన్ సీ సీ ఎఫ్,

#2. కోఠి లో కేంద్రీయ బండార్,

#3. గన్ పార్క్ సమీపంలో ఎన్ ఏ ఏ ఎఫ్ ఈ డి దగ్గర భారత్ రైస్ ని విక్రయిస్తారు.

త్వరలోనే మొబైల్ అవుట్ లెట్ల ద్వారా కూడా బియ్యాన్ని విక్రయిస్తారు. అలాగే ఈ బియ్యాన్ని జియో మార్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. 5 కేజీలు, 10 కేజీలు బ్యాగుల్లో భారత్ రైస్ లభిస్తాయి. తొలి దశలో రిటైల్ మార్కెట్లలో ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయిస్తామని కేంద్రం తెలిపింది.

బియ్యం ధరలను అరికట్టేందుకే కేంద్రం ఇటువంటి చర్యలు చేపట్టింది. బియ్యం ధరలు తగ్గేవరకు ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం వెల్లడించింది. రిటైలర్లు, హోల్సేలర్లు, ప్రొసీజర్లు ప్రతి శుక్రవారం స్టాక్ వివరాలను మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సన్న బియ్యం ధర 60 రూపాయల వరకు ఉండగా భారత 29 రూపాయలకే విక్రయిస్తూ ఉండటంతో సామాన్యులు ఈ షాపులు ముందు క్యూ కడుతున్నారు.


End of Article

You may also like