భారతీయుడు 2 షూటింగ్‌లో ఘోర ప్రమాదం..! ముగ్గురు చనిపోయారు…పదిమందికి తీవ్ర గాయాలు!

భారతీయుడు 2 షూటింగ్‌లో ఘోర ప్రమాదం..! ముగ్గురు చనిపోయారు…పదిమందికి తీవ్ర గాయాలు!

by Megha Varna

Ads

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు 2. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర షూటింగ్ జరుగుతుంది. దురదృష్టపుశాత్తు ఈ షూటింగ్ లో భారీ ప్రమాదం ఏర్పడింది. స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం పాలవ్వగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.శంకర్ కి తృటిలో ప్రమాదం తప్పింది. చనిపోయిన వారిలో ఒకరు అసిస్టెంట్ డైరెక్టర్.

Video Advertisement

ఇక వివరాల లోకి వెళ్తే…షూటింగ్ జరుగుతున్న టైం లో…భారీ క్రేన్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని అందరు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనయ్యారు.

2.0 సినిమా తర్వాత భారీ బడ్జెట్‌తో కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇందులో కాజల్, రకుల్ హీరోయిన్లు. ఇప్పటికే ఈ సినిమా సగం వరకు షూటింగ్ పూర్తయింది. మేజర్ షెడ్యూల్స్ అన్నీ చెన్నై, రాజమండ్రి, హైదరాబాద్‌, రాజస్థాన్‌ లాంటి ప్రదేశాల్లో చిత్రీకరించాడు దర్శకుడు శంకర్. దాంతో పాటు మరిన్ని కీలకమైన షెడ్యూల్స్ కోసం మార్చ్, ఎప్రిల్‌లో చైనా, థాయ్‌లాండ్‌ ప్లాన్ చేసారు కానీ ఈ లోపే ఈ ప్రమాదం సంభవించింది.


End of Article

You may also like