కరోనా బతికున్న వ్యక్తుల నుండే కాదు చనిపోయిన వ్యక్తుల నుండి కూడా వస్తుందేమో అన్న అనుమానాలు జనాల్లో నాటుకుపోయాయి. అందుకే ఎవరైనా చనిపోతే చివరి చూపు చూడడానికి కూడా వెళ్లడానికి భయపడుతున్నారు. అందుకు ఇటీవల జరిగిన ఈ సంఘటన ఒక ఉదాహరణ.

Video Advertisement

కర్ణాటకలోని బెల్గాం జిల్లాలోని అథాని పట్టణం లో నివసించే సదాశివ్ హిరట్టి అనే 55 ఏళ్ల వ్యక్తి గుండె సమస్యలతో బాధ పడుతున్నారు. బుధవారం రాత్రి గుండె సమస్య ఇంకా ఎక్కువ అయ్యింది. అప్పుడు ఇంట్లో అతనికి సహాయం చేయడానికి భార్య, కొడుకు, కుమార్తె కూడా అందుబాటులో లేరు. దాంతో సదాశివ్ హిరట్టి మరణించారు.

సదాశివ్ హిరట్టి కుటుంబానికి ఆర్థికంగా సమస్యలు ఉండటంతో అతని భార్య, పిల్లలు కలిసి సదాశివ్ హిరట్టి పార్ధివ శరీరాన్ని తోపుడు బండిలో పెట్టి స్మశానానికి అంత్యక్రియలకు తీసుకెళ్లారు. అలా తీసుకువెళ్తున్నప్పుడు ఎంతో మంది చూశారు. కానీ వీళ్ళు ఎంత కష్టపడి తోస్తున్నా సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు.

ఎందుకంటే సదాశివ్ హిరట్టి కరోనా వైరస్ తో చనిపోయారేమో అని భయపడ్డారు జనాలు. దాంతో ఎవరూ ముందుకు వచ్చే ధైర్యం చెయ్యలేదు. అయినా సరే సదాశివ్ హిరట్టి భార్య అతని పార్థివ దేహాన్ని ఒక దుప్పటి లో చుట్టి తన పిల్లల సహాయంతో తోపుడు బండిలో స్మశాన వాటిక కి తీసుకు వెళ్లారు అని స్థానికులు చెప్పారు.

watch video: