2 నెలలుగా ఇంటికి రాని భర్త…రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య!

2 నెలలుగా ఇంటికి రాని భర్త…రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య!

by Megha Varna

Ads

పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని పెద్దలు చెప్తూ ఉంటారు.ప్రత్యేకించి మన భారతదేశంలో వివాహానికి చాలా విశిష్టత ఉంది.ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలతో జీవిస్తూ వృద్దాప్యం వచ్చిన కూడా అంతే ప్రేమ వాళ్ళ మధ్యన కొనసాగుతుంది.అయితే మారుతున్నా ప్రపంచంలో వివాహ విలువలు పూర్తిగా దెబ్బతింటున్నాయి.అక్రమ సంబంధాలతో విహహా జీవితంలో కలతలు రేపుకుని జీవితాన్ని విచ్చినం చేసుకుంటున్నారు.తాజాగా వరంగల్ లో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఆమె భార్య.వివరాల్లోకి వెళ్తే …

Video Advertisement

వరంగల్ లో ఓ దంపతులకు పెళ్లి అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది.అప్పటిదాకా వాళ్ళ  జీవితం సంతోషంగానే ఉంది.భార్య ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తుంది.కానీ భర్త మాత్రం ఏ పని చెయ్యకుండా భార్య సంపాదన మీదే ఆధారపడి బ్రతుకుతున్నాడు.అయితే రెండు నెలలుగా భర్త ఇంటికి రాకపోవడంతో భార్యకు అనుమానం వచ్చింది.తెలిసినవారి దగ్గర నుండి భర్త వేరే సంబంధం పెట్టుకున్నాడని అక్కడే ఉంటున్నాడని సమాచారం అందుకుంది.

దీంతో ఒక్కసారిగా భార్య అతను ఉంటున్న ప్రదేశానికి వెళ్ళగానే రెడ్ హ్యాండెడ్ గా ఇంకో అమ్మాయి తో ఉండడాన్ని చూసింది.దీంతో తీవ్ర కోపం వచ్చిన భార్య తన భర్తను రోడ్ మీదకు తీసుకువచ్చి దేహశుద్ది చేసింది.దీంతో ఈ ఘటన వరంగల్ అర్బన్ ఏరియా లో కలకలం రేపింది.దీంతో భార్య తన భర్తపై పోలీస్ కేసు పెట్టి తనకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులను కోరారు.భర్త ఏ ఉద్యోగం చెయ్యకపోయినా ఆవిడా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటే ఆ భర్త ఇలా చెయ్యడం అమానుషం అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు .

source: sakshi


End of Article

You may also like