ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందనేది అక్షర సత్యం .ఒక క్షణంలో తీసుకొనే నిర్ణయం జీవితాన్ని ఎలా ఐన మార్చేయగలదు.మంచిగా మారుస్తుందా లేదా చెడుగా మారుస్తుందా అనేది తీసుకొనే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.అందుకే ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదు బాగా అలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తూ ఉంటారు.ఆలా కాదని క్షణిక ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే మాత్రం జీవితాలు తలకిందులు కావడం మాత్రం ఖాయం.

Video Advertisement

 

లాక్ డౌన్ కాబట్టి అందరూ ఇళ్లకే పరిమితం అయ్యి టీవీ లు చూస్తూ ,కొన్ని గేమ్స్ ఆడుకుంటూ ,రకరకాల వంటలు ఉండుకుంటూ సమయాన్ని సరదాగా బిజిబిజిగా గడుపుతున్నారు.ఈ నేపథ్యంలో గుజరాత్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకొని అంతా చర్చనీయాంశం అయ్యింది.వివరాల్లోకి వెళ్తే …గుజరాత్ లో ఒక ప్రదేశంలో కేశవ అపార్టుమెంట్లో దంపతులు అద్దెకు ఉంటున్నారు.అయితే భర్త హుకుం కు బాగా స్పైసి గా ఉండే వంటకం తినాలనిపించింది .దీంతో భార్యకు మంచి స్పైసి వంటకం చేయాల్సిందిగా ఆర్డర్ చేసాడు .

representative image

కానీ భార్య బిజీగా ఉండడంతో తర్వాత చేస్తాను ఇప్పుడు చెయ్యలేను అని చెప్పింది.దానితో హుకుంకీ తీవ్ర కోపం వచ్చి బిల్డింగ్ మీద నుండి దూకేయడానికి ప్రయత్నించాడు.కానీ కిందపడిపోకుండా అదృష్టం కొద్ది గోడను పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు . దీంతో అపార్ట్మెంట్ వాసులు వచ్చి పైకి లాగి ప్రాణాలు కాపాడారు.ఇలాంటి చిన్న విషయానికి ఎవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు .