కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది అక్రమ సంబంధాల గుట్టు రట్టు అవుతుంది.వీటి ఫలితంగా ఎంతోమంది సంసారాలు నాశనం అవుతున్నాయి.తాజాగా ఒడిశాలో ఇలాంటి ఓ అక్రమ సంబంధం గుట్టు రట్టయింది.


వివరాలలోకి వెళ్తే ఒడిశాలో నివాసముంటున్న శరత్ దాస్ (45),అనిత దాస్(35) దంపతులు జీవనోపాధి కోసం నోయాడలో స్థిరపడ్డారు.వీరిద్దరికీ పెళ్ళయ్యి దాదాపు 15 ఏళ్లు అవుతుంది.వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు.అనిత దాస్ గత కొంతకాలంగా అదే ప్రాంతంలో ఉంటున్న సంజయ్‌(32)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

విషయం తెలుసుకున్న భర్త శరత్ దాస్ ఈ విషయం పై తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు.అయినప్పటికీ అనిత ప్రవర్తన లో మార్పు రాలేదు పైగా తనని అస్తమానం నిలదీస్తున్న తన భర్త ను అంతం చేయాలని నిర్ణయించుకుంది.అందులో భాగంగా మే 1వ తేదీ రాత్రి అనిత, సంజయ్ కలిసి శరత్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతని ముఖం పై దుప్పటి పెట్టీ అతనికి ఊపిరాడకుండా చేసి చంపేశారు.

పొద్దునే లేచి తనకేం తెలియనట్టు కరోనా వచ్చి భర్త చనిపోయాడని దొంగ ఏడుపులు ఏడ్చింది.ఆమె గురించి పూర్తిగా తెలిసిన శరత్ బంధువులు,చుట్టుపక్కల వాళ్ళు రాత్రికి రాత్రి ఆరోగ్యంగా ఉన్న శరత్ ఎలా చనిపోయాడు అనే అనుమానంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు.కంప్లైంట్ తీసుకున్న పోలీసులు వెంటనే శరత్ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించారు.దానితో అసలు కథ బయటపడింది.నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు.